టెక్ రంగానికి చేయూత
శివాజీనగర: బెంగళూరు, మైసూరు, బెళగావిలో మూడు ప్రపంచస్థాయి టెక్ పార్కులను స్థాపించనున్నట్లు సీఎం సిద్దరామయ్య ప్రకటించారు. మంగళవారం బెంగళూరు ప్యాలెస్ మైదానంలో సర్కారు ఆధ్వర్యంలో టెక్ సమ్మిట్‌ను ప్రారంభించి మాట్లాడారు. బెంగళూరుకు పెట్టుబడులను ఆకర్షించేందుకు తగిన పాలసీని, మౌలిక సదుపాయాలను కల్పిస్తామన్నారు. బెంగళూరుకు ఉన్న ప్రత్యేకతలను సీఎం వివరించారు. మంగళూరు, హుబ్లీ–ధారవాడలో ఈవీ వాహనాలు, డ్రోన్ల పరిశ్రమలకు అనుకూలమన్నారు. టెక్ ఆధారిత రంగాల ప్రోత్సాహంపై దృష్టి సారించామన్నారు. ఐటీ–బీటీతో పాటుగా టెక్ రంగంలో సుస్థిర మార్పులకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. డీసీఎం డీ.కే.శివకుమార్, ఐటీ మంత్రి ప్రియాంక ఖర్గే తదితరులు పాల్గొన్నారు.
అలరించిన ఆకృతులు
ప్యాలెస్ మైదానం దేశ విదేశీ ప్రతినిధులతో కళకళలాడింది. మొబైల్, కంప్యూటర్ల విడి భాగాలతో చేసిన ఆకృతులు ఆకట్టుకున్నాయి. వాటి వద్ద సందర్శకులు సెల్ఫీలు తీసుకున్నారు. టెక్ కంపెనీల ప్రతినిధులు, విద్యార్థులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఐటీ, సైన్స్ రంగాల్లో నూతన ఆవిష్కారాలకు అద్దం పట్టే స్టాళ్లు వెలిశాయి.
సీఎం సిద్దరామయ్య హామీ
ప్యాలెస్ మైదానంలో సదస్సు ఆరంభం
Comments
Please login to add a commentAdd a comment