నాబార్డు రుణాలను పెంచండి
బొమ్మనహళ్లి: కర్ణాటకకు నాబార్డ్ అందించే రాయితీ రుణాల మొత్తాన్ని పెంచాలని ముఖ్యమంత్రి సిద్దరామయ్య గురువారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి విన్నవించారు. రాష్ట్ర రైతులకు జరిగిన అన్యాయాన్ని సరిచేయాలని కోరారు. 2023–24వ ఏడాది సంవత్సరంలో నాబార్డ్ రైతుల కోసం రూ. 5,600 కోట్లు కేటాయించింది, ఈ ఏడాది మాత్రం రూ 2,340 కోట్లే ఇచ్చిందని, 58 శాతం తక్కువగా రుణ పరిమితిని కేటాయించడం తగదని కేంద్రమంత్రికి ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో ఈ ఏడాది వ్యవసాయం జోరుగా సాగుతోందని, సబ్సిబీ రుణ పరిమితిని పెంచాలని కోరారు. నాబార్డు నిర్ణయం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారని చెప్పారు. సీఎంతో పాటు మంత్రులు బైరతీ సు రేష్, చెలువరాయ స్వామి ఉన్నారు.
నందిని కేంద్రం ప్రారంభం
ఢిల్లీలో కేఎంఎఫ్ నందిని ఉత్పత్తుల కేంద్రాన్ని సీఎం ప్రారంభించారు. ఢిల్లీలో ఏడాదికి 3–4 లక్షల లీటర్ల నందిని పాలను విక్రయించడమే లక్ష్యంగా పనిచేయాలని తెలిపారు. అమూల్ సంస్థతో పోటీ పడడానికి ప్రయత్నం చేయాలన్నారు.
తగ్గింపు వల్ల రైతులకు కష్టం
కేంద్ర ఆర్థిక మంత్రికి సీఎం వినతి
Comments
Please login to add a commentAdd a comment