ప్రజాతీర్పును శిరసావహిస్తాం ●
● బీజేపీ ఓటమి అభ్యర్థి బంగారు హనుమంతు
సాక్షి,బళ్లారి: సండూరు ఉప ఎన్నికల్లో ఓటమి చెందడానికి తానే బాధ్యత వహిస్తానని, ఎవరిపైన నిందలు వేయనని సండూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేసి ఓటమి పాలైన బంగారు హనుమంతు పేర్కొన్నారు. ఆయన శనివారం నగరంలోని పాలిటెక్నిక్ కళాశాలలో ఓట్లు లెక్కింపు అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఇంకా ఓట్ల లెక్కింపు జరుగుతున్న సమయంలో తన ఓటమిని గుర్తించిన ఆయన ఓట్ల లెక్కింపు కేంద్రం నుంచి ఆవేదనతో బయటకు వచ్చారు. ఆయన వెంట కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తానని నమ్మకం ఉండేదని, అయితే సీఎం, మంత్రులు ఇక్కడే తిష్టవేసి పెద్ద ఎత్తున డబ్బులు పంపిణీ చేసి, ఓటర్లు ప్రలోభ పెట్టి గెలుపొందారన్నారు. ఈ ఓటమికి తానే కారణమని, ప్రజా తీర్పును గౌరవిస్తామని, ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తామన్న మాటలకు కట్టుబడి ఉంటామన్నారు.
ఓటమికి తండ్రి–కొడుకుదే బాధ్యత ●
● ఎమ్మెల్యే యత్నాల్ ధ్వజం
సాక్షి,బళ్లారి: రాష్ట్రంలో జరిగిన సండూరు, శిగ్గాంవి, చెన్నపట్టణ ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడానికి, కాంగ్రెస్ గెలవడానికి ప్రధాన కారణం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీ.వై విజయేంద్ర, మాజీ సీఎం యడ్యూరప్పలే కారణమని విజయపుర ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ యత్నాల్ పేర్కొన్నారు. ఆయన శనివారం విజయపురలో విలేకరులతో మాట్లాడారు. మూడు నియోజకవర్గాల్లో ఓటమికి విజయేంద్ర కారణమని, ఆయన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడుగా పనిచేయడం పార్టీ నాయకులకు, రాష్ట్ర ప్రజలకు కాని ఇష్టం లేదన్నారు. దీంతో ఎన్నికల్లో ఓటమి చెందామని, వచ్చే ఎన్నికల్లోపు మార్పు చేయాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీ హైకమాండ్ ఇప్పటికై నా మేల్కొని రాష్ట్ర బీజేపీ నాయకత్వాన్ని తండ్రి – కొడుకులు నుంచి తప్పిస్తే పార్టీకి మంచి జరుగుతుందని బీజేపీ పెద్దలకు సూచించారు.
గోలపల్లి ఘటనలో నిందితుల అరెస్ట్
రాయచూరు రూరల్: జిల్లాలోని గోలపల్లిలో ఆర్టీసీ బస్సులపై రాళ్లు రువ్విన ఘటనలో నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు లింగసుగూరు సీఐ హుసికెరప్ప వెల్లడించారు. ఈ నెల 18న అర్దరాత్రి సమయంలో లింగసుగూరు తాలూకా హట్టి పోలీస్ స్టేషన్ పరిధిలో గోలపల్లి వద్ద ఆర్టీసీ బస్సులపై రాళ్లు వేసినట్లు అంగీకరించారని, తమ బంధువులు బెంగళూరుకు వెళ్లడానికి గురుగుంట వద్ద బస్సులు ఆపకుండా వెళ్తుండటంతో బస్సులపై రాళ్లు వేశామని చెప్పినట్లు వివరించారు.
కాంగ్రెస్ గ్యారెంటీల ఫలితం ఇది
హుబ్లీ: కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, గ్యారెంటీ పథకాలతో పాటు కార్యకర్తల కృషి వల్ల ఉప ఎన్నికల్లో మూడు చోట్ల గెలుపు సాధించామని బెళగావి జిల్లా ఇన్‌చార్జి మంత్రి సతీష్ జారకిహొళ్లి తెలిపారు. శనివారం ఆయన బెళగావి పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... ఈ ఎన్నికల్లో కార్యకర్తలు కష్టం చాలా ఉందన్నారు. మాకు చెన్నపట్టణం, శిగ్గావి స్థానాలు గెలుపు రావడంతో ఉత్సాం రెట్టింపు అయిందన్నారు. శిగ్గావిలో హిందూ ముస్లిం అన్న భావన దూరం చేశామన్నారు. అహింద ఓట్లు విభజన కాకుండా కృషి చేశామన్నారు. వక్ఫ్ వివాద సృష్టికి అవకాశం ఇవ్వలేదని, దీంతో ఈ ఎన్నికల్లో గెలుపు సాధ్యం అయిందన్నారు. ప్రారంభంలో సండూరు మాత్రమే గెలుస్తామని అనుకున్నాము. అయితే మూడు చోట్ల అహింద ఓట్లు మంచి ఫలితాన్ని ఇచ్చాయన్నారు. ఇప్పటి వరకు బొమ్మైకి 70 శాతం అహింద ఓట్లు పడేవి దాన్ని ఈసారి కాంగ్రెస్ మార్చి వేసిందన్నారు. కాగా మహారాష్ట్రలో బీజేపీ గెలుపుపై మాట్లాడిన ఆయన ఈవీఎంలపై అనుమానం ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment