వీధి దీపాల ఏర్పాటుకు భూమిపూజ
కోలారు: తాలూకాలోని సూలూరు గ్రామ పంచాయతీ పరిధిలోని తలగుంద గ్రామంలోని బస్టాండులో హైమాస్ లైట్‌ల ఏర్పాటు పనులకు శనివారం గ్రామ పంచాయతీ అధ్యక్షుడు పెమ్మశెట్టిహళ్లి సురేష్ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విధాన పరిషత్ సభ్యుడు నజీర్ అహ్మద్ నిధులతో గ్రామంలో బస్టాండు వద్ద హైమాస్ లైట్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఎమ్మెల్యే కొత్తూరు మంజునాథ్, ఎమ్మెల్సీ అనిల్‌కుమార్, నజీర్ అహ్మద్‌లు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. సూలూ రు గ్రామ పంచాయతీలో స్వచ్ఛతను కాపాడడంలో ముందజంలో ఉందన్నారు. జిల్లాలోనే మొదటి స్థానంలో ఉండడం గర్వించదగిన విషయమన్నారు. ఈ సందర్భంగా సూలూరు గ్రామ పంచాయతీ తలగుంద సభ్యుడు టిఎస్ నరసరాజు, వెంకటేశప్ప, సుజాతమ్మ, రబీనా తాజ్, సికిందర్ పాషా తదితరులు పాల్గొన్నారు.
నోటు పుస్తకాలు పంపిణీ
సిరుగుప్ప: నగరంలోని 6వ వార్డు ప్రాథమిక లోయర్ స్కూల్ విద్యార్థులకు బడవర గ్రామీణాభివృద్ధి సంస్థ అధ్యక్షులు దొడ్డ ఉలుగప్ప విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్సిళ్లు, రబ్బర్లు ముఖ్యోపాధ్యాయులు పరవీన్ దొడ్డగట్టి సమక్షంలో అందజేసారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... విద్యార్థులు చక్కగా చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు. ఈ సందర్భంగా సభ్యులు వి.నటరాజ్, సమాజసేవకర్త టి.యల్లప్ప, పూర్వ విద్యార్థి శేక్షావలి, టీచర్లు బసమ్మ చక్రసాలి, తస్లీమ్ తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి పుట్టిన రోజు వేడుక
శ్రీనివాసపురం: మాజీ మంత్రి కేఆర్ రమేష్‌కుమార్ పుట్టిన రోజు వేడుకలను శనివారం ఆయన అభిమానులు పట్టణంలోని పీఎల్‌డీ బ్యాంకు ప్రాంగణంలో కేక్ కట్ చేసి సరళంగా ఆచరించారు. ఈ సందర్భంగా పీఎల్‌డీ బ్యాంకు అధ్యక్షుడు దింబాల అశోక్ మాట్లాడుతూ... తమ నాయకుడు కెఆర్ రమేష్‌కుమార్ మరింతగా ప్రజా సేవ చేయడానికి అవకాశాన్ని భగవంతుడు కల్పించాలన్నారు. ఈ సందర్భంగా కేపీసీసీ సభ్యుడు సంజయరెడ్డి, పీఎల్‌డీ బ్యాంకు డైరెక్టర్ కృష్ణారెడ్డి, డీసీసీ బ్యాంకు డైరెక్టర్ భైరపల్లి వెంకటరెడ్డి, పీఎల్‌డీ బ్యాంకు మాజీ అధ్యక్షుడు చల్దిగానహళ్లి నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment