ఉద్యోగులు తాలూకా అభివృద్ధికి శ్రమించాలి
కేజీఎఫ్: ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పదాధికారులు, అధ్యక్షుడు కేజీఎఫ్ తాలూకా సమగ్ర అభివృద్ధికి అనుగుణంగా విధులు నిర్వహించాలని ఎమ్మెల్యే రూపా శశిధర్ తెలిపారు. శనివారం నూతనంగా ఎన్నికై న తాలూకా ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి అధ్యక్షుడు నరసింహమూర్తి, సభ్యులను ఎమ్మెల్యే అభినందించి మాట్లాడారు. తాలూకా కేంద్రంలో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం భవన నిర్మాణానికి అవసరమైన స్థలం విన్నవించగా త్వరలో ఉద్యోగుల సంఘం భవనం నిర్మించడం కోసం స్థలం మంజూరు చేయిస్తానని, ఎమ్మెల్యే ప్రభుత్వ ఉద్యోగులకు హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రతినిత్యం విధులు నిర్వహించే సమయంలో ఎదురయ్యే సమస్యలను తన దృష్టికి తీసుకు వస్తే సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు. ఉద్యోగులు నిబద్దతతో విధులు నిర్వహించి ప్రజల సమస్యలను పరిష్కరించాలన్నారు. తాలూకా అఽభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని ప్రభుత్వ ఉద్యోగులను కోరారు. తాలూకా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నరసింహమూర్తి మాట్లాడుతూ... ఎమ్మెల్యే కోరిన విధంగా తమ వంతు కర్తవ్యాలను నిర్వహించడం ద్వారా తాలూకా అభివృద్ధికి సహకారం అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా సర్జన్ డాక్టర్ సురేష్‌కుమార్, కోశాధికారి సతీష్‌కుమార్, రాష్ట్ర పరిషత్ సభ్యుడు అంబరీష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment