గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వండి
మాలూరు: చిక్కతిరుపతి గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామాల సర్వాంగీణ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను సద్వినియోగం చేసి గ్రామాలలో మౌలిక సౌలభ్యాలను కల్పించాలని, ఇందుకు గ్రామ పంచాయతీ సభ్యుల సహకారం కూడా ఎంతో అవసరమని గ్రామ పంచాయతీ అధ్యక్షుడు టిఎం రాం ప్రసాద్ తెలిపారు. శనివారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు. చిక్కతిరుపతి గ్రామ పంచాయతీలోని అన్ని గ్రామాలకు అధికారులు, సిబ్బంది వెళ్లి సమస్యలను తెలుసుకుని సమాచారం ఇవ్వాలని ఆ సమస్యలను పూర్తిగా పరిష్కరించాలన్నారు. ప్రభుత్వ పథకాలను అర్హులకు అందించడం ద్వారా ఆ పథకాలు సఫలం కావడానికి సహకరించాలన్నారు. చిక్కతిరుపతి గ్రామ పంచాయతీ పరిధిలో 13 గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలలో తాగునీరు, డ్రైనేజీల నిర్మాణం, స్వచ్ఛతా కార్యక్రమాలకు ప్రాధాన్యత నివ్వాలని, వీధి దీపాలు ఏర్పాటు చేయాలన్నారు. గ్రామ పంచాయతీ ఉపాధ్యక్షురాలు పద్మా వెంకటేష్, పీడీఓ హరీంద్ర గోపాల్, గ్రామ పంచాయతీ సభ్యులు సుజాత, వి రాజశేఖర్, చంద్రకళా, వి మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment