జిల్లాధికారి ఆకస్మిక తనిఖీ
హొసపేటె: విజయనగర జిల్లా హరపనహళ్లి తాలూకాలో కారుతున్న పైకప్పులున్న పాఠశాలలను అనూహ్యంగా జిల్లాధికారి దివాకర్ సందర్శించి మరమ్మతు పనులను పరిశీలించారు. చిన్నారులు, ఉపాధ్యాయులతో మౌలిక వసతులపై సమాచారం తెలుసుకున్నారు. అదే విధంగా హరపనహళ్లిలోని పాఠశాలలు, ఆస్పత్రులు, ఆలయాలను సందర్శించి తాలూకా ఆస్పత్రికి వచ్చిన రోగులకు టోకెన్ విధానాన్ని తప్పనిసరిగా పాటించాలని, ప్రతి రోగికి కూర్చోవడానికి ఆసనం ఏర్పాటు చేయాలని వైద్యాధికారులకు సూచించారు. చెడిపోయిన స్క్యానింగ్ యంత్రాన్ని మూడు రోజుల్లో మరమ్మతు చేసి ఉపయోగించాలని తెలిపారు. బయట స్క్యానింగులు చేసుకురమ్మని రోగులకు తెలియజేయవద్దని ఆదేశించారు. రక్త పరీక్ష యంత్రాన్ని పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment