వ్యవసాయాభివృద్ధికి జిందాల్ సంకల్పం
బళ్లారిఅర్బన్: జిందాల్ ఫౌండేషన్ తన ఏకీకృత సామాజిక బాధ్యత(సీఎస్‌ఆర్) నిధులతో అన్నదాతలను వ్యవసాయ పరంగా ఆదుకొనేందుకు సంకల్పించింది. ఈ ప్రకారం 60 వేలకు పైగా ఎకరాల్లో రైతులకు సాగుకు అనుకూలం అయ్యేలా 21 కొత్త రహిత ఉత్పత్తి కంపెనీలను ఏర్పాటు చేసి, తద్వారా రైతులకు సాగులో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, సాగు పరికరాలను మధ్యవర్తులు, దళారుల బెడద లేకుండా నేరుగా మార్కెట్ సౌకర్యం కల్పించింది. ఈ విషయంపై రెండు రోజుల పాటు ఎఫ్‌టీఓ సమావేశాన్ని అగ్రికాన్–2024 పేరిట మంగళ, బుధవారాల్లో నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ డాక్టర్ రాఘవేంద్ర కే.మెస్త మాట్లాడుతూ రాష్ట్రంలోని రైతులందరికీ ఉత్పత్తి కంపెనీలకు మార్గదర్శనం చేయడానికి తమ శాఖ కృషి చేస్తుందన్నారు. రైతులకు కావాల్సిన అన్ని విషయాల్లో అవగాహన కల్పించడానికి ఉచితంగా శిక్షణ ఇస్తామన్నారు. ఉత్తర కర్ణాటక జిల్లాల్లో జిందాల్ ఫౌండేషన్ 60 వేల మంది రైతులకు సహకారం అందించడం ప్రశంసనీయం అన్నారు.
తగిన సహకారం అందిస్తాం
అన్ని ఎఫ్‌టీఓలతో అవసరమైన సహకారం అందించడానికి తమ శాఖ సిద్ధంగా ఉందన్నారు. జలానయన అభివృద్ధి శాఖ డైరెక్టర్ మహమ్మద్ పర్వేజ్ బంటనాళ్ మాట్లాడుతూ 29 కంపెనీలను ఒకే చోటకు చేర్చి సమావేశం నిర్వహించడం హర్షణీయం అన్నారు. దీనిని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిందాల్ స్ట్రిల్ లిమిటెడ్ సీనియర్ ఉపాధ్యక్షుడు సునీల్ రాల్ఫ్ మాట్లాడుతూ రైతులు ఈ శిక్షణ శిబిరంతో ఆదాయపు బాటలో సాగాలన్నదే కార్యక్రమం ఉద్దేశం అన్నారు. ఫౌండేషన్ ప్రధాన కార్యనిర్వహణ అధికారి సిద్దేష్ సంగ్వి, సీఎస్‌ఆర్ ముఖ్యస్థులు పెద్దన్న బీదల తదితరులు మాట్లాడారు. ఆపెడా, కేపీఏఎఫ్, అసోచామ్, అర్నెస్ట్ అండ్ యంగ్, మూడు జిల్లాల వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్లు, బళ్లారి, విజయనగర, కొప్పళ, చిత్రదుర్గ జిల్లాల్లోని 29 రైతు ఉత్పత్తి కంపెనీల డైరెక్టర్లు, 300 మందికి పైగా రైతులు, ఫౌండేషన్ వ్యవసాయ విభాగం ఆర్గనైజర్ నాగనగౌడ, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment