మైసూరు: భార్యను అనుమానిస్తూ ఆమెతో పాటు పిల్లలను, అలాగే సొంత తల్లిని
చంపిన కిరాతకునికి మైసూరు 5వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు మరణశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.
నిద్రలో ఉండగా హతమార్చి
వివరాలు.. జిల్లాలోని సరగూరు తాలూకా చామేగౌడనహుండి గ్రామానికి చెందిన మణికంఠస్వామి అనే దివ్యాంగునికి 2014 మార్చిలో గంగ అనే యువతితో పెళ్లి జరిగింది. వీరికి సామ్రాట్ (4), రోహిత్ (2) అనే ఇద్దరు కుమారులున్నారు. గంగ మళ్లీ నిండు గర్భంతో ఉంది. కానీ భర్త ఆమె శీలంపై అనుమానంతో గొడవ పడుతుండేవాడు. తన తల్లి కెంపాజమ్మ సర్దిచెప్పబోతుంటే ఆమైపెనా దౌర్జన్యం చేసేవాడు. 2021 ఏప్రిల్ 28న సాయంత్రం 6 గంటల సమయంలో మణికంఠస్వామి గొడవపడి వెళ్లిపోయాడు. రాత్రి ఇంటికి వచ్చి అర్ధరాత్రి వరకూ టీవీ చూస్తూ ఉన్నాడు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఉన్మాదిగా మారిపోయాడు. అందరూ గాఢనిద్రలో ఉండగా ఇనుప ఊత కర్రతో భార్య, పిల్లలు, తన తల్లిని తల, ముఖంపై తీవ్రంగా బాదాడు. ఆపై ఓ కొడుకుని గొంతు పిసికాడు. ఫలితంగా నలుగురితో పాటు గర్భస్థ శిశువు కూడా మరణించింది. ఈ దారుణంతో గ్రామం మొత్తం వణికిపోయింది. సరగూరు మర్డర్స్‌గా ఈ కేసు మార్మోగింది. సరగూరు పోలీసులు హంతకున్ని బంధించి విచారణ చేపట్టారు. సవివరంగా కోర్టులో చార్జిషీట్ సమర్పించారు. మైసూరు 5వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టులో విచారణలో నేరం రుజువైంది. దీంతో జడ్జి గురురాజ్ సోమక్కలవర్ బుధవారం దోషి మణికంఠస్వామికి మరణ శిక్షను విధిస్తూ తీర్పు చెప్పారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ బీఈ యోగేశ్వర్, మాచంగడ ఎస్.నవీన్ కేసును వాదించారు.
Comments
Please login to add a commentAdd a comment