శివాజీనగర: మైసూరు ముడాలో వేల కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని ఆర్టీఐ కార్యకర్త గంగరాజు ఆరోపించారు. ముడా స్థలాల కేసులో విచారణకు రావాలని మంగళవారం ఈడీ అధికారులు ఆయనకు ఫోన్ చేశారు. గంగరాజు బెంగళూరులో ఉన్న ఈడీ కార్యాలయానికి వచ్చి పలు ఆధారాలను అందజేశారు. ఆయన విలేకరుతో మాట్లాడుతూ ఇంతకు ముందు వచ్చినపుడు కొన్ని ఆధారాలను ఇచ్చాను. సీఎం సిద్దరామయ్య పొందిన స్థలాలు మాత్రమే కాదు, ముడాలో జరిగిన రూ.5 వేల కోట్ల అక్రమాల గురించి తనిఖీ జరగాలి. దీనిపై నా వద్ద ఉన్న అన్ని ఆధారాలను అధికారులకు ఇస్తానని గంగరాజు చెప్పారు. మంత్రి భైరతి సురేశ్, మాజీ ముడా కమిషనర్లు జీ.టీ.దినేశ్ కుమార్, నటేశ్లపై ఆరోపణలు చేశారు. సిద్దరామయ్య స్థలాల్లో రూ. 20– 25 కోట్ల గోల్మాల్ జరిగింది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని గంగరాజు డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment