పుట్టింటికి వెళ్తూ పరలోకానికి
చింతామణి: బైకు అదుపుతప్పి రోడ్డుపై పడిపోగా, వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు వారి మీద నుంచి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో క్షణాల్లోనే దంపతులు మృత్యువాత పడ్డారు. ఈ యాక్సిడెంటు బుధవారం చింతామణి పట్టణం ఎంజీ రోడ్డు ఆదర్శ టాకీస్ దగ్గర జరిగింది. వివరాలు.. వెంకటేష్ (40), భార్య సరస్వతమ్మ (35) చింతామణి తాలూకా బురడగుంట వద్ద కొమ్మసంద్ర గ్రామానికి చెందినవారు. వ్యవసాయం చేసేవారు. సరస్వతమ్మ పుట్టినిల్లు చింతామణి తాలూకా కై వార హోబళి నారాయణపల్లి. బుధవారం తమ్ముని కొడుకు అయ్యప్ప స్వామి ఇరుముడి కార్యక్రమం ఉండడంతో భర్తతో కలిసి పుట్టినింటికి బయల్దేరింది. చింతామణి పట్టణంలో వాహన రద్దీ ఎక్కువగా ఉండడంతో వెంకటేష్ అదుపుతప్పాడు. దీంతో బైక్‌తో పాటు ఇద్దరు రోడ్డుపై కుడివైపున పడిపోయారు. శిడ్లఘట్ట నుంచి చింతామణికి వస్తున్న కేఎస్ ఆర్టీసీ బస్సు బస్సు ఇరువురి తలలపై దూసుకెళ్లడంతో ఈ ఘోరం సంభవించింది. ఈ దుర్ఘటనతో అక్కడ భీతావహ వాతావరణం ఏర్పడింది. పెద్దసంఖ్యలో జనం పోగయ్యారు. డీఎస్పీ మురళీధర్, సీఐ విజయకుమార్, ఎస్‌ఐ మమత పరిశీలించారు. పట్టణంలో ఎంజీ రోడ్డును విస్తరణ చేయకపోవడంతో ట్రాఫిక్ ఎక్కువై నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు ఆరోపించారు. మంత్రి సుధాకర్ చొరవచూపి రహదారిని వెడల్పు కోరారు.
బైక్ నుంచి పడిపోయిన దంపతులు..
వారి మీద దూసుకెళ్లిన బస్సు
ఇద్దరూ దుర్మరణం
చింతామణిలో విషాద ఘటన
బస్సును ఢీకొన్న కారు
ముగ్గురు నగరవాసుల మృతి
దొడ్డబళ్లాపురం: వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని అదే వేగంతో పక్క రోడ్డులో వస్తున్న కేఎస్‌ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని ముగ్గురు మృతి చెందిన సంఘటన రామనగర తాలూకా సంగబసవనదొడ్డి గ్రామం వద్ద బెంగళూరు–మైసూరు రహదారిపై చోటుచేసుకుంది. బెంగళూరు శివాజినగర్‌కు చెందిన లియాకత్ (50), ఆస్మా (38), నూర్ (40) మృతులు. బెంగళూరు నుంచి మైసూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారును అతివేగంతో నడపడమే కారణమని ప్రాథమిక విచారణలో తెలిసింది. కారులో ఎయిర్‌బ్యాగులు తెరుచుకున్నా ప్రాణాలు దక్కలేదు. ప్రమాదం కారణంగా కొన్ని గంటలపాటు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
Comments
Please login to add a commentAdd a comment