యశవంతపుర: సీఎం సిద్ధరామయ్యపై ఉన్న ముడా ఇళ్ల స్థలాల కేసును సీబీఐకీ అప్పగించాలని హైకోర్టులో దాఖలైన పిటిషన్‌ను గురువారం న్యాయమూర్తి ఎం నాగప్రసన్న విచారించి జనవరి 15కు వాయిదా వేశారు. అదే రోజున తీర్పును ప్రకటిస్తానని తెలిపారు. ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసినట్లు పిటిషనర్ స్నేహమయి కృష్ణ తరఫు న్యాయవాది జడ్జికి తెలిపారు. కోర్టు ఎదురుగా ఉన్న బిల్డింగ్‌కు నోటీసు ఇవ్వడానికి 35 రోజులు పట్టిందా? అని న్యాయమూర్తి ప్రశ్నించారు. సీఎం తరఫు ప్లీడర్లు అభిషేక్ మను సింఘ్వి, కపిల్ సిబల్.. తమ అభ్యంతరాలను తెలిపేందుకు గడువు ఇవ్వాలని కోరారు. దీంతో జనవరి 15కు వాయిదా వేస్తున్నట్లు జడ్జి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment