హుబ్లీ: గత కొన్నేళ్ల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు సాధకుల సన్మానం చేసే సంప్రదాయాన్ని పెట్టుకున్న అమృత సీ్త్ర ప్రధాన సమితి కార్యం ప్రశంసనీయం అని స్థానిక శ్రీ రుద్ర మునిశ్వర దాసోహ మఠం డాక్టర్.శివకుమార స్వామి తెలిపారు. అణ్ణిగేరిలోని వీరరాణి కిత్తూరు చెన్నమ్మ, సర్కిల్‌లో శ్రీ అమృతేశ్వర దేవస్థాన జాతర శుభవేళ అవార్డుల ప్రదానం, సాంస్కృతిక కార్యక్రమాలకు స్వామి సానిధ్యం వహించి మాట్లాడారు. శివానంద కరిగార మాట్లాడుతూ.. అవార్డులు ఇవ్వడం ద్వారా సాధకులకు ప్రోత్సహం అందించే కార్యం ఎంతో మంచిదన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా అణ్ణిగేరి కీర్తిని ఇనుమడింపజేశారన్నారు. క్రిడిల్ మాజీ అధ్యక్షుడు షణ్ముఖప్ప మాట్లాడుతూ... ఏటా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం శ్రీ అమృతేశ్వర జాతర ఉత్సవాలకు మరింత శోభను ఇచ్చారన్నారు. కార్యక్రమంలో కబ్బనూరు హళ్లికేరి బసవేశ్వర జానపద కళా బృందం ముఖ్యస్థులు, హుబ్లీ తాలూకా శబ్బ గ్రామ అజింత్ నాగప్ప బసపూరకు అమృతశ్రీ ప్రశస్తిని ప్రదానం చేశారు. అణ్ణిగేరి ప్రముఖ తబలా వాదకులు, బసవేశ్వర కనివాద కళా బృందం ముఖ్యస్థులు చంద్రశేఖర్ హొసమనిలకు బెల్‌వళ సిరి ప్రశస్తిని ప్రదానం చేశారు. కార్యక్రమంలో సమితి అధ్యక్షుడు ఈరప్ప గురికార, శివశంకర కల్లూర, బసవరాజ్ కొలివాడ, మంజునాథ మాయన్నవర, మారుతీ కాళి, హుస్సేన్ బెటగేరి యల్లప్ప తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment