హుబ్లీ: రైతుల పంపుసెట్లకు ప్రభుత్వం నియమానుసారంగా విద్యుత్ సరఫరా చేయాలని అధికార్లకు జిల్లా ఇన్‌చార్జి మంత్రి సంతోష్‌లాడ్ సూచించారు. జిల్లాలోని కలఘటికి తాలూకా పంచాయతీ మీటింగ్ హాల్‌లో ఆయన తాలూకా ప్రగతి పరిశీలన సమావేశంలో మాట్లాడారు. అటవీ ప్రాంతాల వ్యవసాయ భూములకు రాత్రి 3 గంటలకు విద్యుత్ సరఫరా చేస్తే అడవి జంతువుల బెడద ఉంటుందన్నారు. అందుకే వారికి పగలు ఎక్కువ సమయం విద్యుత్ సరఫరా ఇవ్వాలన్నారు. వ్యవసాయానికి అధిక విద్యుత్ సరఫరాకు మంజూరైన నిర్మాణ పనులపై సరైన వివరాలు ఇవ్వక పోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులతో చర్చించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి జేస్కాం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌కు సూచించారు. కలఘటికిలో తాలూకా ఆస్పత్రి నూరు పడకలు ఉన్నాయని, గత సమావేశంలో పారిశుద్ధ్యంపై పలు సూచనలు ఇచ్చానని గుర్తు చేశారు. తాలూకాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఉత్తమ వైద్య చికిత్సలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో టీపీఈఓ పరశురాం సవంత, గ్రేడ్–2 తహసీల్దార్ బసవరాజ, గ్యారెంటీ అమలు జిల్లాధ్యక్షులు ఎస్‌ఆర్ పాటిల్, సీఐ శ్రీశైల కౌజలిగి సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment