కళ్యాణ కర్ణాటక ప్రగతికి పెద్దపీట | - | Sakshi
Sakshi News home page

కళ్యాణ కర్ణాటక ప్రగతికి పెద్దపీట

Published Mon, Dec 23 2024 12:26 AM | Last Updated on Mon, Dec 23 2024 12:26 AM

కళ్యాణ కర్ణాటక ప్రగతికి పెద్దపీట

కళ్యాణ కర్ణాటక ప్రగతికి పెద్దపీట

సీఎం సిద్దు హామీ

కలబుర్గిలో హృద్రోగ ఆస్పత్రి షురూ

సాక్షి, బళ్లారి: కళ్యాణ కర్ణాటకకు ప్రత్యేక సచివాలయం ఏర్పాటు చేసేందుకు గట్టి చర్యలు తీసుకుంటామని, ఈ ప్రాంతాన్ని సమగ్రాభివృద్ధి చేస్తామని సీఎం సిద్దరామయ్య పేర్కొన్నారు.ఆయన ఆదివారం కలబుర్గిలో జయదేవ హృద్రోగ ఆస్పత్రిని ప్రారంభించి మాట్లాడారు. కలబుర్గిలోని జయదేవ హృద్రోగ ఆస్పత్రిలో మిన్నగా వైద్య సేవలు అందించే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు. చుట్టుపక్కల జిల్లాల ప్రజలకు ఈ ఆస్పత్రి సంజీవినిగా మారనుందన్నారు. 371 బెడ్లతో ఆధునిక వసతులతో ఆస్పత్రిని నిర్మించినట్లు చెప్పారు. మాజీ మంత్రి సీటి రవి అసెంబ్లీలో మంత్రి లక్ష్మీ హెబ్బాల్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆ మాటలు రికార్డుల్లో ఉన్నాయని చెప్పారు. బీజేపీలో జాతీయ స్థాయిలో పనిచేసే రవి ఈ రకంగా మాట్లాడటం అత్యంత బాధాకరమన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ ఆర్టికల్‌ 371(జే) ఈ ప్రాంతంలో అభివృద్ధి కోసం కార్యక్రమాలను చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు,అధికారులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement