రాష్ట్రంలో మూతపడిన హాప్‌కామ్స్ అంగళ్లు
బొమ్మనహళ్లి: రాష్ట్రంలో ఉన్న సుమారు 486 హాప్‌కామ్స్‌లో 140కి పైగా దుకాణాలు మూతపడ్డాయి. హాప్‌కామ్స్‌లో ఆన్ని రకాల కూరగాయలు, వివిధ రకాల పండ్లు విక్రయిస్తారు. ప్రభుత్వ ఉద్యానవనశాఖ వీటిని నిర్వహిస్తోంది. రైతుల నుంచి వినియోగదారులకు అనే నినాదం మీద అన్నదాతల ఉత్పత్తులకు గిరాకీ కల్పించే లక్ష్యంతో 1965లో హాప్‌కామ్స్‌కు నాంది పలికారు. ప్రైవేట్ వ్యాపారులతో పోటీ పడలేక, కొనుగోలుదారులను ఆకట్టుకోలేక తదితర కారణాల వల్ల 140 కి పైగా షాపులను సర్కారు మూసివేయడంతో వాటి కథ కంచికేనా అనే అనుమానాలు తలెత్తాయి. బెంగళూరుతో పాటు రాష్ట్రంలో మొత్తం సుమారు 486 హాప్‌కామ్స్ షాపులు ఉండగా, ఇప్పుడు 346 దుకాణాలు మాత్రమే పనిచేస్తున్నట్లు తెలిసింది.
హాప్‌కామ్స్‌లు మూత పడటానికి కారణాలు..:
● హాప్‌కామ్స్‌లో అన్ని రకాల కూరగాయలు, పండ్లు విక్రయాలు జరుగుతుంటాయి. అనేకచోట్ల వ్యాపారం సాగకపోవడంతో, ప్రైవేటు వ్యాపారులతో పోటీ పడలేక హాప్‌కామ్స్ అంగళ్లు మూతపడ్డాయి.
● బెంగళూరులో హాప్స్ కామ్స్ షాపుల్లో పనిచేసే అనేకమంది ఉద్యోగులు రిటైరయ్యారు. ఉద్యోగుల కొరత కూడా ఆ షాపులను పీడిస్తోంది.
● ప్రస్తుతం హాప్‌కామ్స్‌లో మొత్తం 525 మంది సిబ్బంది ఉండగా, మరో సుమారు 284 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
● అంతే కాకుండా బెంగళూరులోని ప్రముఖ మాల్స్‌లో ఉన్న హాప్స్‌కామ్స్ షాపులు నామమాత్రంగా తయారయ్యాయి. మాల్స్‌కు వస్తున్న ప్రజలు హాప్స్‌కామ్స్‌లోకి రాకపోవడంతో పండ్లు, కూరగాయలను కొనేవారు కరువయ్యారు.
● ఇలా నెలల తరబడి జరగడంతో ఉద్యానశాఖ ఉన్నతాధికారులు మూసివేతకే నిర్ణయం తీసుకుంటున్నారు.
● సిలికాన్ సిటీలో ఇటీవలి సంవత్సరాలలో రోడ్ల వెడల్పు పనులు, మెట్రో రైలు వంతెనల నిర్మాణం అనేది హాప్‌కామ్స్‌కు ఇబ్బంది అయ్యింది. ఈ పనుల్లో ఆ షాపులు అనేకం తొలగించారు. మళ్లీ వాటిని ఏర్పాటుచేసింది లేదు.
ప్రైవేటు వ్యాపారుల కుట్ర?
హాప్‌కామ్స్‌లో బియ్యం, సిరిధాన్యాలు, ఆయిల్ ఫెడ్ వంట నూనెలు, పండ్ల రసాలు ఇలా ఇంటికి ఉపయోగపడే అనేక ఉత్పత్తులు విక్రయించేవారు. కానీ ఏం జరిగిందో కానీ, ప్రైవేటు వ్యాపారులు ఇది చూసి భయపడి హాప్‌కామ్స్ మూతపడేలా కుట్రలు చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. వీటిని ఉద్యానవన శాఖ ఖండించింది. కొన్నిచోట్ల హాప్‌కామ్స్ సిబ్బంది, ప్రైవేటు వ్యాపారులతో కుమ్మకై ్క, వారి ఉత్పత్తులను హాప్‌కామ్స్‌లో అమ్మేవారు. దీంతో సర్కారీ సరుకు అమ్మకాలు పడిపోయాయి అని తెలిసింది.
రాష్ట్రంలో 140 హాప్‌కామ్స్
అంగళ్లకు తాళం
వ్యాపారం జరగక నష్టాలు
దశాబ్దాల వైభవం కనుమరుగు
బెంగళూరు 89 షాపులు బాగలకోటె 2 బెళగావి 3 బీదర్‌లో 1 బళ్ళారిలో 2 చిత్రదుర్గలో 4 ధార్వాడలో 6 హాసన్‌లో 3 కల్బుర్గిలో 1 మండ్యలో 9 మైసూరులో 8 మంగళూరు 2 తుమకూరు 2 విజయపురలో 6 శివమొగ్గ 1
Comments
Please login to add a commentAdd a comment