నటనలోనూ మేటి
తుమకూరు: చదువు, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో సమగ్ర వికాసం ఏర్పడుతుందని సహకార మంత్రి కేఎన్ రాజణ్ణ తెలిపారు. నగరంలోని కర్ణాటక పబ్లిక్ పాఠశాల ఆడిటోరియంలో బుధవారం పాఠశాల విద్యా శాఖ ఏర్పాటు చేసిన పీయూ కాలేజీ విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనను మంత్రి ప్రారంభించారు. నైపుణ్యానికి పేద, ధనిక అనే భేదభావాలు ఉండవని చెప్పారు. ప్రతి ఒక్కరికీ సమానమైన ప్రతిభను దేవుడు ప్రసాదించాడని, దాన్ని చక్కగా ఉపయోగించుకుని విద్యార్థులు ఎదగాలని మంత్రి సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వైవిధ్య పాత్రల్లో నటనా వైదుష్యాన్ని ప్రదర్శించి అబ్బురపరిచారు. సాహితీవేత్త బిళిగెరె కృష్ణమూర్తి, ఎమ్మెల్యే జ్యోతి గణేశ్, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.
అలరించిన పీయూ విద్యార్థులు
Comments
Please login to add a commentAdd a comment