405 అడుగుల స్తంభం నుంచి పడిన జెండా
హొసపేటె: అంతటా గణతంత్ర వేడుకల్లో మూడు రంగుల జెండా సగర్వంగా రెపరెపలాడగా హొసపేటెలో మాత్రం తీవ్ర అపచారం జరిగింది. జెండా ఎగరవేసిన కొంతసేపటికి నేల మీదకు జారిపోయింది. హొసపేటె నగరంలోని జిల్లా స్టేడియంలో ఆదివారం ఉదయం 9 గంటలకు జరిగిన గణతంత్ర దినోత్సవంలో దేశంలోనే అత్యంత ఎత్తైన 405 అడుగుల స్తంభం మీద జిల్లా ఇన్‌చార్జి మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ బృహత్ జెండాను ఎగురవేశారు. తరువాత వేదిక ముందు మరో జెండాను ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరిసున్న సమయంలో 405 అడుగుల స్తంభంపై నుంచి జాతీయ జెండా ఒక్కసారిగా పడిపోయింది. దీంతో అందరూ నివ్వెరపోయారు. వేడుకకు వచ్చిన అధికారులు, ప్రజలు, విద్యార్థులు అయోమయంలో పడిపోయారు. జాతీయ జెండాకు ఇంత అపచారం జరగరాదని అనుకున్నారు. దీనిపై మంత్రి స్పందిస్తూ సంబంధిత అధికారిపై చర్యలు తీసుకుంటామన్నారు. జెండాను సక్రమంగా బిగించకపోవడంతో ఇలా జరిగిందని తెలుస్తోంది.
హొసపేటెలో తీవ్ర అపచారం
Comments
Please login to add a commentAdd a comment