హొసపేటె: విజయనగర జిల్లా అభివృద్ధికి ప్రత్యేక గ్రాంట్ ఇవ్వాలని సీఎం సిద్దరామయ్యను కోరామని, మరో ఆరు నెలల్లో జిల్లా మెడికల్ కాలేజీ పనులు పూర్తవువుతాయని జిల్లా ఇన్‌చార్జి మంత్రి బీజెడ్ జమీర్ అహమ్మద్ ఖాన్ తెలిపారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో జిల్లా స్టేడియంలో ఆదివారం నిర్వహించిన 76 గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన జాతీయ జెండాను ఎగుర వేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. వచ్చే బడ్జెట్‌లో జిల్లా అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని సీఎంను కోరుతానని తెలిపారు. ఈ ప్రాంత రైతుల చిరకాల కోరిక అయిన చెక్కర కర్మాగారం ఏర్పాటుకు ఎమ్మెల్యే గవియప్ప ఇప్పటికే స్థలాన్ని గుర్తించారన్నారు. ఆ స్థలాన్ని పరిశీలించి షుగర్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కూడా చర్యలు తీసుకుంటామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడాకారులకు ప్రత్యేక ప్రోత్సహకాలు ఇచ్చిందన్నారు. విజయనగరం జిల్లా స్టేడియం అభివృద్ధికి అవసరమైన గ్రాంట్ కూడా ఇస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాధికారి దివాకర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment