యువజనోత్సవం
ఉర్రూతలూగించిన
రాయచూరు రూరల్: నగరంలోని వ్యవసాయ విశ్వ విద్యాలయంలో ఆదివారం యువజనోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పశు సంవర్ధక శాఖ విశ్రాంత అధికారి బసవరాజ్ బెణ్ణె యువజనోత్సవాలను ప్రారంభించారు. విద్యార్థులు చదువుతోపాటు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలన్నారు. అనంతరం నాటక ప్రదర్శనలు, నృత్యాలతో విద్యార్థులు అలరించారు. వైస్ చాన్సలర్ హన్మంతప్ప, సిండికేట్ సభ్యులు బసవన గౌడ, తిమ్మప్ప, మల్లేష్, మల్లిఖార్జున, అధికారులు గురురాజ్, వీరన గౌడ, అయ్యన గౌడర్, ధనూజి, గౌడప్ప, రవిశంకర్, దేశాయి, నాయక్, సత్యనారా యణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment