హుబ్లీ: మైక్రోఫైనాన్స్ వేధింపుల వల్ల ప్రజలు ఊళ్లు విడిచి వెళ్లిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇంకొందరు భార్యలను అమ్మే స్థితికి రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిపెట్టిందని అసెంబ్లీలో బీజేపీ పక్ష ఉపనేత అరవింద బెల్లద్ ఆరోపించారు. నగరంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతి తాండవం ఆడుతోందని ధ్వజమెత్తారు. కోట్ల కొద్ది రూపాయలను తీసుకొని పోలీసు అధికారులకు పోస్టింగ్‌లు ఇస్తున్నారు. ఈ విధంగా పోస్టింగ్ తెచ్చుకున్న పోలీసులు సహజంగా దొంగలు, డ్రగ్స్ డీలర్లు, మీటర్ వడ్డీ దందాకోరులతో డబ్బులు వసూళ్లు చేసుకుంటున్నారని ఆరోపించారు. దీంతో బాధితులకు ఠాణాలలో రక్షణ దొరకడం లేదు. సీఎం విధానసౌధ ఏసీ రూములో కూర్చొని సమావేశాలను నిర్వహిస్తే వేధింపులకు అడ్డుకట్ట పడదు. ప్రత్యేక చట్టాన్ని తేవాల్సిన అవసరముందని అన్నారు. మైసూరు రాజులు మొత్తం రాష్ట్రానికే కానుకలు ఇచ్చిన వారు వారి పథకాలు అఖండ కర్ణాటక ఎదుగుదలకు దోహదపడ్డాయి. అలాంటి రాజవంశ ఆస్తిని దోపిడీకి పాల్పడుతున్న సీఎం సిద్దరామయ్య సిగ్గుపడాలని హేళన చేశారు. బెంగళూరులో ప్యాలెస్ భూములకు నష్టపరిహారం (టీడీఆర్) ఇవ్వకపోవడాన్ని ప్రస్తావిస్తూ, విద్వేష రాజకీయాలు చేయరాదు, ఇకనైనా రాజవంశస్తులకు అన్యాయం చేయడాన్ని మానుకోవాలి, లేకుంటే రాబోయే రోజుల్లో బీజేపీ పోరాటం చేయాల్సి వస్తుందని చెప్పారు.
ఆ రకంగా మైక్రోఫైనాన్స్ వేధింపులు: ఎమ్మెల్యే బెల్లద్
Comments
Please login to add a commentAdd a comment