![బాల్ బ్యాడ్మింటన్ విజేతలు వీరే](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10blr10-120003_mr-1739212644-0.jpg.webp?itok=bBsfiO8t)
బాల్ బ్యాడ్మింటన్ విజేతలు వీరే
బళ్లారిఅర్బన్: 70వ జాతీయ బాల్‌బ్యాడ్మింటన్ పురుషుల, అఖిల భారత బాల్ బ్యాడ్మింటన్ ఆహ్వానిత మహిళల పోటీలను మున్సిపల్ కళాశాల మైదానంలో నాలుగు రోజుల పాటు సంబంధిత అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆసక్తికరంగా నిర్వహించారు. పోటీల్లో విజేతల వివరాలను ఆ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు రాఘవేంద్ర ప్రసాద్ వెల్లడించారు. ప్రధాన కార్యదర్శి వై.రాజారావ్ మాట్లాడుతూ బ్యాడ్మింటన్ ఫెడరెషన్ ఆఫ్ ఇండియా వర్ధమాన క్రీడాకారుల అవార్డులను ప్రకటించారు. స్టార్ ఆఫ్ ఇండియా విజేతలుగా మహిళల విభాగంలో ఆల్వాస్ మూడబిదిరే జట్టు ప్రథమ ప్రశస్తి, సీఎస్‌ఎన్‌ఏ దిండిగల్ జట్టు ద్వితీయ ప్రశస్తిని, దేవరంచేలం జట్టు తృతీయ ప్రశస్తి, పురుషుల విభాగంలో ప్రథమ బహుమానాన్ని ఇండియన్ రైల్వేస్, ద్వితీయ బహుమానాన్ని ఆంధ్రప్రదేశ్, తృతీయ బహుమతిని కర్ణాటక జట్లు సాధించాయి. ట్రోఫీలను ప్రముఖులు నారా ప్రతాప్‌రెడ్డి, వై.రాజారావ్, పృథ్విరాజు, సౌమ్యజ్యోతి, వై.రంగనాథరావు, సీ.నారాయణ ప్రదానం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment