సాక్షి, బెంగళూరు: రాష్ట్రంలో మైక్రో ఫైనాన్స్ సంస్థలను కట్టడి చేసేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రత్యేక ఆర్డినెన్స్ మరోసారి గవర్నర్ చెంతకు చేరింది. ఇటీవల ఆర్డినెన్స్‌కు సిద్దరామయ్య సర్కారు ఆమోదించి గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ఆమోదం కోసం పంపించడం తెలిసిందే. బిల్లులో కొన్ని అంశాలపై సందేహాలను లేవనెత్తి ఆయన వెనక్కి పంపించారు. సర్కారు ఆ అంశాలపై సమాచారం పొందుపరచి మళ్లీ రాజ్‌భవన్‌కు పంపించింది. న్యాయ నిపుణులతో చర్చించి పలు సలహాలు స్వీకరించి మార్పులు చేర్పులుచేసినట్లు ప్రభుత్వ పెద్దలు తెలిపారు. గవర్నర్ గెహ్లాట్ దాన్ని మళ్లీ తిరస్కరిస్తారా, లేక ఆమోదముద్ర వేస్తారా అనేది సస్పెన్స్‌గా మారింది. రాజ్యాంగ నియమాల ప్రకారం సర్కారు రెండోసారి పంపిన బిల్లును గవర్నర్ తిరస్కరించరాదని నిపుణులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment