● మెట్రో సంస్థ వివరణ
శివాజీనగర: బెంగళూరులో నమ్మ మెట్రో రైళ్లలో చార్జీలను పెంచినందుకు భారీ వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దేశ రాజధాని ఢిల్లీ మెట్రో చార్జీలను మించిపోయాయని సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. ఇక మేం మెట్రో రైలు ఎక్కేది లేదు, బస్సులు, సొంత వాహనాల్లోనే ప్రయాణిస్తామని కొందరు ప్రకటించారు. దీంతో మెట్రో సంస్థ బీఎంఆర్‌సీఎల్ స్పందించింది. పెంచిన చార్జీ ఎక్కువేం కాదని పేర్కొంది. ప్రజలు కోపగించుకునే స్థాయిలో పెంచలేదని తెలిపింది. చాలా సంవత్సరాల నుంచి ధరలను సవరించలేదు. ఇప్పుడు అనివార్యమైంది. సిటీలో ఆటోలు, ట్యాక్సీల కంటే తక్కువ చార్జీలే మెట్రోలో ఉన్నాయి అని ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment