![త్రివ](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10bng120_mr-1739212670-0.jpg.webp?itok=g5jR9Kqn)
త్రివేణి సంగమాన కుంభమేళా
మైసూరు: ఉత్తరప్రదేశ్ పవిత్ర గంగా నది కుంభమేళా జరుగుతుండగా, కన్నడనాట కూడా అలాంటి ఉత్సవం ఆరంభమైంది. కావేరి, కపిల, స్ఫటిక నదుల సంగమ స్థలమైన మైసూరు జిల్లాలో ఉన్న టి.నరిసిపురలో మూడురోజుల పాటు జరిగే దక్షిణ భారత కుంభమేళాకు సోమవారం నాంది పలికారు. సంగమం ఒడ్డున శ్రీఅగస్తేశ్వర స్వామి ఆలయంలో ఉదయం 6 గంటలకు స్వామివారికి స్వామీజీలు, అర్చకులు విశేష పూజలు చేశారు. గణపతి హోమం, కలశ స్థాపన, దేవతారాధనలు జరిపి 13వ కుంభమేళాను ప్రారంభించారు. పెద్దసంఖ్యలో ప్రముఖులు, భక్తులు తరలివచ్చారు. త్రివేణి సంగమంలో నదీమ తల్లులకు పూజలు నిర్వహించారు. మైసూరు ఆదిచుంచనగిరి సోమనాథేశ్వర స్వామీజీ, కాగినేల కనకగురు నిరంజనానందపురి స్వామీజీ, కై లాసనంద మఠం జయేంద్రపుర సహా పలువురు స్వామీజీలు హాజరయ్యారు. మైసూరు జిల్లాధికారి లక్ష్మీకాంత రెడ్డి, ఎస్పీ విష్ణువర్ధన్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రజలు స్నానఘట్టాల్లో పుణ్యస్నానాలు ఆచరించి నరసింహ స్వామి, బల్లేశ్వర ఆలయాలలో పూజలు నిర్వహించారు.
టి.నరిసిపురలో 3 రోజుల వేడుక
వేలాది భక్తుల పుణ్యస్నానాలు
![త్రివేణి సంగమాన కుంభమేళా1](https://www.sakshi.com/gallery_images/2025/02/11/10bng122_mr-1739212670-1.jpg)
త్రివేణి సంగమాన కుంభమేళా
![త్రివేణి సంగమాన కుంభమేళా2](https://www.sakshi.com/gallery_images/2025/02/11/10bng19d-120024_mr-1739212670-2.jpg)
త్రివేణి సంగమాన కుంభమేళా
![త్రివేణి సంగమాన కుంభమేళా3](https://www.sakshi.com/gallery_images/2025/02/11/10bng19-120024_mr-1739212670-3.jpg)
త్రివేణి సంగమాన కుంభమేళా
Comments
Please login to add a commentAdd a comment