అధికారులు జవాబుదారీగా వ్యవహరించాలి | Sakshi
Sakshi News home page

అధికారులు జవాబుదారీగా వ్యవహరించాలి

Published Tue, Apr 23 2024 8:20 AM

- - Sakshi

ఖమ్మం సహకారనగర్‌: గ్రామపంచాయతీల ప్రత్యేక అధికారులు జవాబుదారీతనంతో వ్యవహరిస్తూ సమస్యల పరిష్కారానికి పాటుపడాలని అదనపు కలెక్టర్‌ బి.సత్యప్రసాద్‌ సూచించారు. కలెక్టరేట్‌లో సోమవారం ఆయన జీపీల ప్రత్యేక అధికారులతో సమావేశమై పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా తదితర అంశాలపై సమీఓఇంచచారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉండేలా పర్యవేక్షిస్తుండడంతో పాటు తాగునీటి సరఫరాకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. మిషన్‌ భగీరథ సరఫరా లేని చోట ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, అవసరమైతే ప్రైవేట్‌ వనరులను లీజ్‌కు తీసుకోవాలన్నారు. అలాగే, నర్సరీలు, విద్యుద్దీపాలు, అంతర్గత రహదారుల నిర్వహణపై దృష్టి సారించాలని, సకాలంలో పన్నులు వసూలు చేయడమే కాక ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా అవగాహన కల్పించాలని సూచించారు. ఈసమీక్షలో జెడ్పీ సీఈఓ వినోద్‌, డీఆర్డీఓ సన్యాసయ్య పాల్గొన్నారు.

ఏకలవ్య మోడల్‌ స్కూళ్లలో ప్రవేశానికి పరీక్ష

భద్రాచలంటౌన్‌: ఉమ్మడి జిల్లాలోని తెలంగాణ ప్రభుత్వ ఏకలవ్య మోడల్‌ సంక్షేమ విద్యాలయాల్లో 6వ తరగతిలో ప్రవేశాలుకల్పించేందుకు ఈనెల 28న పరీక్ష నిర్వహించనున్నట్లు భద్రాచలం ఐటీడీఏ పీఓ ప్రతీక్‌జైన్‌ తెలిపారు. ఈనెల 28న ఉదయం 10.30 గంటల నుంచి 12.30 వరకు పరీక్ష ఉంటుందని పేర్నొన్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు https:// tsemrs. telangana. gov. in వెబ్‌సైట్‌ ద్వారా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. పరీక్షల నిర్వహణకు భద్రాద్రి జిల్లాలో మూడు, ఖమ్మం జిల్లాలో ఒక కేంద్రం ఏర్పాటు చేసినట్లు పీఓ తెలిపారు.

స్వచ్ఛమైన తాగునీరు

అందించాలి

వైరా: వైరా రిజర్వాయర్‌ వద్ద సక్రమంగా క్లోరినేషన్‌ చేయడం ద్వారా ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేయాలని మిషన్‌ భగీరథ ఈఎన్‌సీ కృపాకర్‌రెడ్డి ఆదేశించారు. వైరా రిజర్వాయర్‌ గుట్టపై బోడేపూడి సుజల స్రవంతి పథకం, మిషన్‌ భగీరథ ఇన్‌ టేక్‌వెల్‌ ప్రాంతాలను సోమవారం ఆయన పరిశీలించారు. ఇటీవల రిజర్వాయర్‌ నుంచి రంగు మారిన నీరు సరఫరా అవుతుందనే ప్రచారంతో పరిశీలించిన ఆయన వివరాలు ఆరా తీశారు. ప్రస్తుతం రిజర్వాయర్‌లో నీటి నిల్వలు, క్లోరినేషన్‌ విధానంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. రిజర్వాయర్‌ డెడ్‌ స్టోరేజ్‌కు చేరుతున్న నేపథ్యాన నీరు కలుషితం కాకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. సీఈ కె.శ్రీనివాస్‌, ఎస్‌ఈ సదాశివకుమార్‌, ఈఈలు వాణిశ్రీ, పుష్పలత, డీఈ నర్సింహమూర్తి, ఏఈ మణిశంకర్‌ పాల్గొన్నారు.

విధుల్లో నిర్లక్ష్యాన్ని

ఉపేక్షించేది లేదు

తల్లాడ ప్రమాదంపై

ఎన్పీడీసీఎల్‌ సీఎండీ ఆగ్రహం

ఖమ్మంవ్యవసాయం: విద్యుత్‌ ఉద్యోగులు, సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని ఎన్పీడీసీఎల్‌ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి హెచ్చరించారు. జిల్లాలోని తల్లాడ సబ్‌స్టేషన్‌లో ఆదివారం ట్రాన్స్‌ఫార్మర్‌ పేలగా లైన్‌మెన్‌గా గాయాలయ్యాయి. ఈ నేపథ్యాన సీఎండీ సోమవారం ఫోన్‌ చేసి వివరాలు ఆరా తీశారు. ఉద్యోగులు, సిబ్బంది విధినిర్వహణలో నిబంధనలు పాటించాలని, పనిప్రాంతంలో గ్లౌజ్‌లు, హెల్మెట్‌ విధిగా ధరించాలని సూచించారు. తల్లాడ సబ్‌స్టేషన్‌లో జరిగిన ప్రమాదానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని పేర్కొన్న సీఎండీ.. అసిస్టెంట్‌ డివిజనల్‌ ఇంజనీర్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేస్తూనే విధిగా భద్రతా చర్యలు పాటించాలని సూచించారు.

సమావేశంలో మాట్లాడుతున్న 
అదనపు కలెక్టర్‌ సత్యప్రసాద్‌
1/2

సమావేశంలో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ సత్యప్రసాద్‌

క్లోరినేషన్‌ ప్రాంతాన్ని పరిశీలిస్తున్న 
ఈఎన్‌సీ, అదికారులు
2/2

క్లోరినేషన్‌ ప్రాంతాన్ని పరిశీలిస్తున్న ఈఎన్‌సీ, అదికారులు

Advertisement
Advertisement