ముగిసిన ఆళ్వార్ల వైభవ ప్రవచనం
ఖమ్మంగాంధీచౌక్: ఖమ్మం నగరంలోని బైపాస్ రోడ్ శ్రీసీతారామాంజనేయ స్వామి దేవస్థానంలో మూడు రోజులుగా కొనసాగుతున్న ఆళ్వార్ల వైభవ ప్రవచన కార్యక్రమం ఆదివారం ముగిసింది. చివరి రోజున ‘మహాయోగి పెరియాళ్వార్’ అంశంపై హైదరాబాద్‌కు చెందిన విద్వన్మణి కె.వెంకటనర్సింహాచార్యులు, ‘పరకాలుడు తిరుమంగై అళ్వార్’ అనే అంశంపై తిరుపతికి చెందిన విద్వాన్ కేఈ లక్ష్మీనరసింహన్, ‘విప్రనారాయణులు తొండరడిప్పొడి అళ్వార్’ అనే అంశంపై విజయవాడకు చెందిన భాషాసేవిక కొమాండూరి కృష్ణ, ‘మునివాహనులు తిరుప్పాణి అళ్వార్’ అనే అంశంపై హైదరాబాద్‌కు చెందిన మహామహోపాధ్యాయ ఎస్.వి. రంగరామానుజాచార్యులు ప్రవచనాలు చేశారు. అనంతరం కోదండరామాచార్యుల సంపాదకత్వంలో రూపొందించిన ‘ద్వాదశ సూరి వైభవం’ అనే గ్రంథాన్ని మహామహోపాధ్యాయ, శాస్త్ర రత్నాకర, శాస్త్ర విద్వన్మణి సముద్రాల వెంకట రంగ రామానుజాచార్యులు ఆవిష్కరించారు. వేదావధాని కండ్లకుంట్ల కోదండరామాచార్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీ వైష్ణవ సేవా సంఘం జిల్లా అధ్యక్షులు వేదాంతం రాఘవాచార్యుల దంపతులు, సంఘం ప్రధాన కార్యదర్శి ఎన్‌సీహెచ్ ప్రసాదాచార్యులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment