ఈ బిడ్డ.. బంగారు ‘కొండ’!
ఖమ్మంలో 4.1 కేజీల శిశువు జననం
ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ మహిళ 4.1 కేజీల మగ శిశువుకు జన్మనిచ్చింది. ఏపీలోని చింతలపూడికి చెందిన ఎన్.సుజాత ప్రస వం కోసం సత్తుపల్లి ప్రభు త్వ ఆస్పత్రిలో చేరగా, ఆమె మూడో కాన్పు కావడం, బీపీ తదితర సమస్యలు ఉండటంతో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి రిఫర్ చేశారు. ఈమేరకు మంగళవారం వైద్యులు ఇందు, జ్యోత్న్స ఆధ్వర్యాన ఆమెకు సాధారణ ప్రసవం చేయడంతో మగశిశువు జన్మించాడు. మూడో కాన్పులో బరువైన శిశువు జన్మించడం అరుదని, ఆరోగ్య సమస్యలు ఉన్నా జాగ్రత్తగా కాన్పు చేసిన వైద్యులు, సిబ్బంది స్వరూపరాణి, అయేష, కల్పనను సూపరింటెండెంట్ ఎల్.కిరణ్కుమార్, ఆర్ఎంఓ రాంబాబు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment