వాతావరణ ం
జిల్లాలో బుధవారం కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంది. రాత్రి వేళ చలి ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
కంప్యూటర్ పరిజ్ఞానం
పెంపొందించుకోవాలి
చింతకాని: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కంప్యూటర్ పరిజ్ఞానం పెంపొందించుకోవాలని, తద్వారా ఉన్నత విద్యకు ఉపయోగపడుతుందని జిల్లా విద్యాశాఖాధికారి సోమశేఖరశర్మ తెలిపారు. చింతకాని మండలంలోని రామకృష్ణాపురం, పందిళ్లపల్లి, నేరడ ఉన్నత పాఠశాలల్లో బ్రైట్ చైల్డ్ ఫౌండేషన్ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్‌లను మంగళవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించి నాణ్యమైన విద్య అందిస్తున్నట్లు తెలిసారు. దాతల చేయూతతో సమకూర్చిన కంప్యూటర్లను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. బ్రైట్ చైల్డ్ ఫౌండేషన్ ట్రస్టీ ఫణికుమార్, తహసీల్దార్ కూరపాటి అనంతరాజు, ఎంఈఓలు వీరపనేని శ్రీనివాసరావుతోపాటు పిన్నెల్లి వెంకటేశ్వర్లు, వంశీ, అభిలాష్, కార్తీక్, సూర్య, ఈశ్వర్, శ్రవణ్, అమూల్యరెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
‘నవోదయ’ దరఖాస్తుల
స్వీకరణ గడువు పొడిగింపు
కూసుమంచి: పాలేరులోని జవహర్ నవోదయ విద్యాలయలో వచ్చే విద్యాసంవత్సరానికి 9, 11వ తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీ కోసం నిర్వహించే ప్రవేశపరీక్ష దరఖాస్తుల గడువు మరోమారు పొడిగించారు. ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారంతో ముగిసిన గడువును 26వ తేదీ వరకు పొడిగించినందున అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
రిజిస్ట్రేషన్ సేవలకు
అంతరాయం
ఖమ్మంమయూరిసెంటర్: స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కార్యాలయాల్లో కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఈ–కేవైసీలో ఆధార్ సంబంధిత సేవలకు అంతరాయం ఏర్పడడంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మంగళవారం మధ్యాహ్నం 12నుండి 3 గంటల వరకు రిజిస్ట్రేషన్లు జరగలేదు. ఉమ్మడి జిల్లాలోని 11 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలతో పాటు జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలోనూ పలు సేవలకు అంతరాయం ఏర్పడింది. ఆధార్ సర్వర్‌లో తలెత్తిన సమస్యతో రాష్ట్రవ్యాప్తంగా ఈ పరిస్థితి నెలకొందని అధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment