ఆరోగ్య కార్యక్రమాల అమలుపై ప్రత్యేక శ్రద్ధ
రఘునాథపాలెం: జాతీయ స్థాయి ఆరోగ్య కార్యక్రమాలు నూరు శాతం అమలయ్యేలా వైద్యులు, సిబ్బంది శ్రద్ధ వహించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కళావతిబాయి సూచించారు. మండలంలోని మంచుకొండ పీహెచ్‌సీని బుధవారం తనిఖి చేసిన ఆమె వైద్యసేవలు, వ్యాక్సినేషన్‌పై ఉద్యోగులకు సూచనలు చేశారు. అనంతరం రాంక్యాతండాకు మంజూరైన ఆరోగ్య ఉపకేంద్రానికి కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. అలాగే, గ్రామంలో మెడికల్‌షాపులో తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండా మందులు ఇవ్వొవద్దని ఆదేశించారు. ఆతర్వాత పుటానితండాలో వ్యాక్సినేషన్‌ను, రఘునాథపాలెం ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్‌లో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ చందూనాయక్, పీహెచ్‌సీ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ గోలి రమాదేవి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment