చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి
కారేపల్లి: పురుగుమందు తాగిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన గోవింద్‌తండాలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని గోవింద్‌తండాకు చెందిన ఆంగోతు జగన్ (27) మద్యానికి బానిసై పనులకు వెళ్లకుండా ఇంటివద్దనే ఉంటున్నాడు. భార్య ఆమని ఈ నెల 17వ తేదీన.. భర్త జగన్‌ను మందలించి పుట్టింటికి వెళ్లింది. మనస్తాపం చెందిన జగన్ పురుగుమందు తాగాడు. కుటుంబ సభ్యులు ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. భార్య ఆమని ఫిర్యాదు మేరకు ఏఎస్‌ఐ నాగరాజకుమారి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అనుమతి లేకుండా క్లినిక్ నిర్వహణ
ఖమ్మంరూరల్: మండలంలోని ఏదులాపురం క్రాస్‌రోడ్‌లో అనుమతులు లేకుండా క్లినిక్ నిర్వహిస్తున్న బిలీఫ్ వైద్యశాల యాజమాన్యానికి నోటీసులిచ్చినట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్ కళావతిబాయి తెలిపారు. బుధవారం ఆమె వైద్యశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిబంధనల ప్రకారం జిల్లా వైద్య ఆదోగ్య శాఖ నుంచి అన్ని అనుమతులు తీసుకున్నాకే వైద్యశాల కార్యకాలాపాలు నిర్వహించాలని, అలా కాకుండా ఎలాంటి అనుమతులు లేకుండా వైద్యశాల నడిపిస్తున్నందుకు యాజమాన్యానికి నోటీసులిచ్చినట్లు డీఎంహెచ్‌ఓ ‘సాక్షి’కి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment