ఉద్యోగుల మానసికోల్లాసానికే వనభోజనాలు
మధిర: విధి నిర్వహణలో నిత్యం తలమునకలయ్యే ఆర్టీసీ ఉద్యోగులు కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా గడిపేందుకు వన భోజనాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఖమ్మం రీజినల్ మేనేజర్ సరిరామ్ నాయక్ తెలిపారు. గురువారం మధిర డిపో ఆర్టీసీ ఉద్యోగులు, వారి కుటుంబాలకు వన సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎం మాట్లాడుతూ కార్తీక మాసంలో వన భోజనాలు నిర్వహిస్తున్నా విధినిర్వహణలో ఉండే ఆర్టీసీ ఉద్యోగులు కుటుంబంతో హాజరుకాలేని పరిస్థితి ఉందన్నారు. ఈ నేపధ్యాన ఆర్టీసీ కుటుంబమే సామాజికవర్గంగా వన భోజనాలకు రూపకల్పన చేసిన రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కేఎంపీఎల్‌లో ప్రథమ స్థానం సాధించిన డ్రైవర్ పేరయ్యతో పాటు వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన ఉద్యోగులను సన్మానించారు. అలాగే, వన సమారాధనలో నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఆర్‌ఎం పవిత్ర, డిపో మేనేజర్ శంకర్‌రావు, ఉద్యోగులు టీసీఎన్.రెడ్డి, ఎంఆర్‌సీ.రావు, డి.వెంకటేశ్వర్లు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీసీ ఖమ్మం ఆర్‌ఎం సరిరామ్‌నాయక్
Comments
Please login to add a commentAdd a comment