ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్రంలోని పలు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వికటిస్తూ విద్యార్థులు అస్వస్థతకు గురైనా ప్రభుత్వంలో చలనం రావడం లేదని సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు ఒక ప్రకటనలో విమర్శించారు. అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం పిల్లల ప్రాణాలను గాలికి వదిలేస్తోందని పేర్కొన్నారు. ఒక్క మాగనూర్‌లోనే కాకుండా అనేక జిల్లాల్లోని పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సాగడం లేదని తెలిపారు. ఈక్రమంలో విద్యార్థులు బయట పదార్థాలు తినడంతోనే అనారోగ్యం పాలయ్యారని అధికారులతో చెప్పించడం దుర్మార్గమని పేర్కొన్నారు. అంతేకాక ఆందోళనలు చేస్తున్న పీడీఎస్‌యూ, ఇతర సంఘాల నాయకులను అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నట్లు రంగారావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment