విద్యార్థుల సమగ్రాభివృద్ధికి కృషి చేయాలి
గిరిజన గురుకులాల ఆర్‌సీఓ నాగార్జునరావు
మణుగూరు రూరల్: ఉపాధ్యాయులు మెరుగైన బోధన ద్వారా విద్యార్థుల సమగ్రాభివృద్ధికి కృషి చేయాలని గిరిజన గురుకులాల ఆర్‌సీఓ నాగార్జునరావు సూచించారు. మణుగూరు మండలం గుట్టమల్లారంలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ బాలికల పాఠశాల, కళాశాలను ఆయన గురువారం తనిఖీ చేశారు. పాఠశాల, కళాశాల పరిసరాలు, విద్యార్థుల వసతి సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు రికార్డులను తనిఖీ చేసిన ఆర్‌సీఓ మెనూ ఆధారంగా మధ్యాహ్న భోజనం అమలవుతోందా, లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థులతో మమేకమై బోధన చేయాలని, వారి సామర్‌ాధ్యల పెంపునకు కృషి చేయాలని సూచించారు. తరగతి గదిలోకి సెల్‌ఫోన్లు తీసుకురావొద్దని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మణుగూరు తహసీల్దార్ రాఘవరెడ్డి, ఎంపీడీఓ టి.శ్రీనివాసరావు, పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
రాకాసి గూళ్లను
సందర్శించిన అధికారులు
అశ్వాపురం: అశ్వాపురం మండలంలోని మనుబోతులగూడెం గ్రామపంచాయతీ పరిధి వేములూరులో పురాతన రాకాసి గూళ్లను అధికారులు గురువారం పరిశీలించారు. ‘పురాతన రాకాసి గూళ్లు!’ శీర్షికన ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్న అంశంపై బుధవారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీంతో స్పందించిన కలెక్టర్ కలెక్టర్ జితేష్ వి.పాటిల్ గ్రామాన్ని సందర్శించాలని అధికారులను ఆదేశించారు. ఈమేరకు పురాతనమైన రాకాసి గూళ్లను పరిశీలించిన వివిధ శాఖల అధికారులు వివరాలతో కలెక్టర్‌కు నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు. సెర్ప్ డీపీఎం రంగారావు, ఎంపీడీఓ వరప్రసాద్, ఏపీఎం సత్యనారాయణ, ఉపాధి హామీ ఏపీఓ సీతరాములు, టీఏలు వెంకటేష్, కాంతారావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment