ధాన్యం అమ్మిన 48 గంటల్లో బోనస్
వేంసూరు/తల్లాడ: ధాన్యం కాంటా పూర్తయి ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో మద్దతు ధరతో పాటు క్వింటాకు రూ.500 బోనస్ జమ అవుతోందని జిల్లా వ్యవసాయాధికారి డి.పుల్లయ్య వెల్లడించారు. వేంసూరు మండలంలోని మర్లపాడు, చౌడవరం, పల్లెవాడ ధాన్యం కొనుగోలు కేంద్రాలతో పాటు వానాకాలం సీజన్ పంటల నమోదును గురువారం ఆయన పరి శీలించారు. ఈ సందర్భంగా డీఏఓ మాట్లాడుతూ ధాన్యాన్ని ఆరబెట్టి తీసుకొస్తే మద్దతు ధర లభిస్తుందని తెలిపారు. అలాగే, వరి కోతల అనంతరం దుబ్బులను కాల్చకుండా భూమిలో కలియదున్నాలని సూచించారు. అనంతరం జీరో టిల్లేజ్ విధానంలో మొక్కజొన్న సాగుపై ఆయన అవగాహన కల్పించారు. ఏఓ రాంమోహన్, ఏఈఓలు, సొసైటీ సీఈఓలు పాల్గొన్నారు. కాగా, తల్లాడలోని పత్తి కొనుగోలు కేంద్రాన్ని కూడా డీఏఓ తనిఖీ చేసి మాట్లాడారు. రైతులు ఇబ్బంది పడకుండా ఉదయాన్నే కొనుగోళ్లు ప్రారంభించాలని, సాయంత్రం ఆరు గంటల తర్వాత రైతులు వస్తే అధికారుల నుంచి అనుమతితోనే కొనుగోలు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. సత్తుపల్లి ఏడీఎ శ్రీనివాసరెడ్డి, తల్లాడ ఏఈఓ మురళీకృష్ణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment