బస్తీ దవాఖాన ఆకస్మిక తనిఖీ
ఖమ్మంవైద్యవిభాగం: వైఎస్‌ఆర్‌నగర్‌లోని బస్తీ దవాఖానాను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి.కళావతిబాయి బుధవారం అకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ నిర్వహిస్తున్న వైద్య ఆరోగ్య సేవలను పరిశీలించారు. ఓపీ సేవలు, ఫార్మసీ స్టోర్, రిజిస్టర్లను పరిశీలించి రోగులకు అసౌకర్యం కలగకుండా సేవలు అందించాలని సూచించారు. అలాగే మాతా శిశు సంక్షేమం, వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం, అసంక్రమణ వ్యాధులను అరికట్టే కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం పరిశీలించి, వ్యాక్సిన్ నిల్వలు, కోల్డ్ చైన్ మెయింటెనెన్స్ చేస్తూ పిల్లలకు ఏ ఇబ్బంది లేకుండా అందించాలని, అందించిన సేవలను ఎప్పటి కప్పుడు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment