కొణిజర్ల: మొక్కజొన్నలో కలుపు నివారణకు రైతులు మందు పిచికారీ చేయగా పక్కనే ఉన్న మిర్చి తోటపై పడడంతో ఎండిపోయింది. కొణిజర్లకు చెందిన రైతు చింతల వెంకటేశ్వర్లు కౌలుకు తీసుకుని ఎకరంలో మిర్చి సాగుచేశాడు. ప్రస్తుతం మిర్చి కాత దశలో ఉండగా, పక్క పొలాల రైతులు మొక్కజొన్నలో కలుపు నివారణకు మందు పిచికారీ చేశారు. అది కాస్తా మిర్చి తోటపై పడటంతో దాదాపు పది గుంటల పరిధిలో మొక్కలు మాడిపోయాయి. ఇప్పటివరకు రూ.3.10లక్షల వరకు పెట్టుబడి పెట్టిన తాను నష్ట పోయినందున న్యాయం చేయాలని కోరుతూ వెంకటేశ్వర్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment