కేఎంసీలో యువరక్తం!
● కొత్తగా 46మంది వార్డ్, అకౌంట్ ఆఫీసర్లు ● గ్రూప్–4లో కొలువులతో అభ్యర్థులకు పోస్టింగ్ ● అత్యధికులు రైతు కుటుంబాల నుండి వచ్చినవారే ● సిబ్బంది కొరత తీరడంతో పనుల్లో పెరగనున్న వేగం
ఖమ్మంమయూరిసెంటర్: సిబ్బంది లేమితో కొట్టుమిట్టాడుతున్న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కొత్తగా ఉద్యోగాల్లో చేరుతున్న వారితో కళకళలాడుతోంది. కొన్నాళ్ల క్రితం గ్రూప్–4 ఉద్యోగాలు పొందిన 43మంది వార్డ్ ఆఫీసర్లు, జూనియర్ అకౌంటెంట్లు ముగ్గురిని ప్రభుత్వం ఇటీవల కేఎంసీకి కేటాయించింది. దీంతో వీరు విడతల వారీగా విధుల్లో చేరారు. కాగా, వార్డ్ ఆఫీసర్లు సరిపడా లేక ప్రజాసమస్యల పరిష్కారం, ప్రభుత్వ పథకాల అమలు, కేఎంసీ కార్యకలాపాల్లో జాప్యం జరుగుతోంది. ఇప్పుడు కొత్తగా సిబ్బందిని కేటాయించడం, అంతా యువతే కావడంతో పనుల్లో వేగం పెరుగుతుందని భావిస్తున్నారు.
వ్యవసాయ కుటుంబాల నుండే..
గ్రూప్–4లో ఉద్యోగాలు సాధించి కేఎంసీకి కేటాయించిన వారిలో అత్యధికం వ్యవసాయ కుటుంబాల నుండి వచ్చిన వారే కావడం విశేషం. తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ పిల్లలను చదివించగా.. వారు ప్రభుత్వ కొలువులు సాధించడంతో వారి కుటుంబాల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. కాగా, ఇందులో కొందరు కానిస్టేబుళ్లుగా ఉద్యోగాలు చేస్తూనే గ్రూప్–4 ఉద్యోగాలు సాధించారు. ఇంకొందరు ఇతర పోటీ పరీక్షల ఫలితాల కోసం ఎదురుచూస్తూనే ఈ ఉద్యోగాల్లో చేరారు. ఈమేరకు కేఎంసీ చేరిన కొత్త ఉద్యోగులను ‘సాక్షి’ పలకరించగా తమ అభిప్రాయాలు వెల్లడించారు.
మొదటి ప్రయత్నంలోనే..
మా నాన్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు కావడంతో డిగ్రీ పూర్తి చేశాక ఆయన సూచనలతో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యాను. ఇలా మొదటి ప్రయత్నంలోనే గ్రూప్–4 ఉద్యోగం సాధించా. కేఎంసీ వార్డ్ ఆఫీసర్‌గా ఉద్యోగం రావడం ఆనందంగా ఉంది.
– బూర్గుగడ్డ సౌమ్యశ్రీ, ఖమ్మం
Comments
Please login to add a commentAdd a comment