జనవరి 5న యోగా పోటీలు
కొణిజర్ల: యోగా ప్రచార సమితి ఆధ్వర్యాన వచ్చేనెల 5వ తేదీన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల స్థాయి యోగా పోటీలు నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యుడు రామన అచ్యుత్ ఓ ప్రకటనలో తెలిపారు. కొణిజర్ల మండలం తనికెళ్లలో జరిగే ఈ పోటీల్లో పాల్గొనడానికి 8నుంచి 60ఏళ్ల వయస్సు కలిగిన సీ్త్ర, పురుషులు అర్హులని వెల్లడించారు. ఆసక్తి ఉన్న వారు జనవరి 1వ తేదీ సాయంత్రంలోగా దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు 81064 68801 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అమలుచేయాలి
టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అద్యక్షుడు చావా రవి
బోనకల్: ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చి హామీలను వెంటనే అమలు చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అద్యక్షుడు చావా రవి డిమాండ్ చేశారు. బోనకల్‌లో గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడా రు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అధికా రంలోకి రాగానే అమలు చేయాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలపై ఉంటుందని అన్నారు. కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏ లను విడుదల చేయాలని కోరారు. కేజీబీవీ, సమగ్ర శిక్షా ఉద్యోగులకు మినిమమ్ టైంస్కేల్ అమలు చేయాలని, ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రాథమిక విద్య బలోపేతానికి చర్యలు చేపట్టాలని సూచించారు. నూతన విద్యావిధానాన్ని రద్దు చేయాలని, ప్రాథమిక, ప్రాథమికో న్నత పాఠశాలల ఉపాధ్యాయులకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలని కోరారు. సమావేశంలో టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు షేక్ రంజాన్, కార్యదర్శి రామకృష్ణ, నాయకులు నెల్లూరి వీరబాబు, సద్దాబాబు, గోపాల్‌రావు, కమలాకర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment