డిజైన్‌ లోపంతోనే పగుళ్లు | - | Sakshi
Sakshi News home page

డిజైన్‌ లోపంతోనే పగుళ్లు

Published Fri, Jan 3 2025 1:12 AM | Last Updated on Fri, Jan 3 2025 1:13 AM

డిజైన

డిజైన్‌ లోపంతోనే పగుళ్లు

సత్తుపల్లి సీహెచ్‌సీ బంకర్‌పై నిపుణుల నివేదిక
● నిర్మాణ సమయాన పర్యవేక్షణ లోపమే కారణమంటున్న కార్మికులు ● రైలు మార్గంలో బొగ్గు రవాణా కోసం రూ.398 కోట్లతో నిర్మాణం ● పగుళ్లతో ప్రస్తుతం అరకొరగానే రవాణా

సింగరేణి(కొత్తగూడెం): రాజుల సొమ్ము రాళ్ల పాలు అన్న చందంగా సింగరేణిలో కొందరు అధికారుల తీరు ఉంటోంది. సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధి సత్తుపల్లిలోని జేవీఆర్‌, కిష్టారం ఓసీల నుండి రైలు మార్గం ద్వారా బొగ్గు రవాణా కోసం రూ.కోట్ల వ్యయంతో నిర్మించిన సీహెచ్‌పీ(కోల్‌ హ్యాండ్లింగ్‌ ప్లాంట్‌) బంకర్లలో పగుళ్లు రావడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ బంకర్లు నిర్మించి రెండేళ్లు కావొస్తుండగా పగుళ్లు వచ్చినట్లు మూడు నెలల క్రితం గుర్తించారు. ఈ విషయమై ఢిల్లీ ఐఐటీ నిపుణుల(థర్డ్‌ పార్టీ)తో విచారణ జరిపించగా డిజైన్‌ లోపమే కారణమని ఇటీవల నివేదిక అందించినట్లు తెలిసింది. దీంతో నిర్మాణం సమయాన అధికారులు పర్యవేక్షించకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందనే విమర్శలు వస్తున్నాయి.

రూ.398 కోట్లతో నిర్మాణం

సింగరేణి పరిధిలోని కొత్తగూడెం ఏరియా బొగ్గు ఉత్పత్తి లక్ష్యసాధనలో కీలకంగా ఉంటోంది. దీంతో ఈ ఏరియా పరిధి సత్తుపల్లిలోని జేవీఆర్‌, కిష్టారంల్లో నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి అవుతుండగా, రవాణా కోసం సీహెచ్‌పీ నిర్మించారు. ఇందులో మూడు బంకర్లు ఉండగా ఒకటి పూర్తిగా, ఇంకొకటి పాక్షికంగా పగుళ్లు బారాయి. ఈ కారణంగా ఇక్కడి నుంచి రోజుకు 10 రైల్వే రేక్‌ల ద్వారా బొగ్గు రవాణా చేయాల్సి ఉండగా ప్రస్తుతం 5, 6కు మించి రేక్‌లు వెళ్లడం లేదు.

రెండేళ్లలోనే పగుళ్లు..

సింగరేణి సంస్థకు గుండెకాయలా నిలుస్తున్న కొత్తగూడెం ఏరియాలో నెలకు దాదాపు 13 లక్షల బొగ్గు టన్నుల ఉత్పత్తి జరుగుతోంది. గడిచిన ఎనిమిది నెలల్లో ఎక్కడా లేని విధంగా 87,02,014 టన్నుల బొగ్గు ఉత్పత్తి నమోదైంది. అయితే, సీహెచ్‌పీలోని బంకర్లలో పగుళ్లు రావడంతో ఉత్పత్తికి అనుగుణంగా రవాణా జరగడం లేదని తెలుస్తోంది. కాగా, బొగ్గు రవాణా కోసం రూ.398 కోట్ల వ్యయంతో సీహెచ్‌పీ నిర్మాణ బాధ్యతలను సమంత కంపెనీకి కట్టబెట్టారు. అయితే, డిజైన్‌ కానీ నిర్మాణ సమయంలో పనులు ఎలా జరుగుతున్నాయనే అంశాన్ని కానీ ఆనాటి ఏరియా అధికారులు కానీ సివిల్‌, క్వాలిటీ, విజిలెన్స్‌ అధికారులు కానీ పట్టించుకోలేదనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం బంకర్లలో పగుళ్లు రావడానికి డిజైన్‌ లోపమే కారణమని నిపుణుల కమిటీ నివేదికతో వెల్లడైనట్లు సమాచారం. అంతేకాక బంకర్‌ నిర్మాణంలో నాణ్యమైన సామగ్రి వాడలేదనే అంశాన్ని కూడా నివేదికలో పొందుపర్చారని ఓ అధికారి తెలిపారు.

నిర్వహణ ఎవరి బాధ్యత?

ఏరియాలోని జేవీఆర్‌, కిష్టారం ఓసీల్లో ఉత్పత్తి అయ్యే బొగ్గును రైలు మార్గం ద్వారా రవాణా చేసేందుకు 8వేల టన్నుల సామర్థ్యం కలిగిన మూడు బంకర్లను నిర్మిస్తే వాటిలో ఒకటి పూర్తిగా, ఇంకొకటి పాక్షికంగా పగుళ్లు బారింది. కాగా, నిర్మాణ సంస్థకే కొన్నేళ్ల పాటు నిర్వహణ బాధ్యత ఉంటుందని తెలుస్తోంది. అయితే, అగ్రిమెంట్‌లో ఏముందో తెలి యదు కానీ బంకర్లకు పగుళ్లు వచ్చాయని తెలిసినా కంపెనీ బాధ్యులు ఇటువైపు దృష్టి సారించడం లేద ని సమాచారం. ప్రస్తుతం మరమ్మతులు చేపట్టడానికి మరో రూ.3.50కోట్ల మేర వ్యయమవుతుందని తెలుస్తుండగా, అధికారులు టెండర్లు కూడా పిలిచా రు. ఇంతవరకు బాగానే ఉన్నా నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆనాటి అధి కారులు ఏం చర్యలు తీసుకుంటారో తేలాల్సి ఉంది.

రవాణాకు అంతరాయం వాటిల్లకుండా...

ఈ ఏడాది నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు బొగ్గు ఉత్పత్తి, రవాణాపై దృష్టి సారించాం. ఇందులో భాగంగా సీహెచ్‌పీలో బంకర్ల మరమ్మతుకు టెండ ర్లు పిలిచాం. ఇందుకు వ్యయాన్ని నిర్మాణం చేపట్టి న కంపెనీతో చెల్లింపులు జరిపేలా ఉన్నతాధికారులు చర్చలు జరుపుతున్నారు.

– శాలేం రాజు, కొత్తగూడెం ఏరియా జనరల్‌ మేనేజర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
డిజైన్‌ లోపంతోనే పగుళ్లు1
1/1

డిజైన్‌ లోపంతోనే పగుళ్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement