‘ఎవరెస్ట్’కు అవకాశం.. వెళ్లేందుకు అవరోధం..
● ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పర్వతారోహకుడు ● సాయం అందించాలని వైరా ఏసీపీకి విన్నపం
వైరా: పెనుబల్లి మండలానికి చెందిన బర్మావత్ మోతీకుమార్‌కు ప్రపంచంలోనే ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించే అవకాశం వచ్చింది. కానీ అంతదూరం వెళ్లాలంటే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాడు. ఈ క్రమంలో తనకు సాయం అందించాలని కోరుతూ గురువారం వైరా ఏసీపీ ఎం ఏ రెహమాన్‌ను కలిసి వేడుకున్నాడు. ఈ సందర్భంగా మోతీకుమార్ మాట్లాడుతూ తాను దక్షిణాఫ్రికాలోని కిలిమంజారో పర్వతాన్ని, రష్యాలోని మౌంట్ ఎల్ బ్రూజ్ – 40 పర్వతాలను అధిరోహించానని తెలిపాడు. ప్రస్తుతం ఎవరెస్ట్ శిఖరం ఎక్కేందుకు అవకాశం వచ్చిందని, అయితే ఆర్థికంగా తనకు అంత శక్తి లేదని చెప్పాడు. దీంతో వైరా డివిజన్ పోలీసుల నుంచి తగిన సాయం అందిస్తామని ఏసీపీ మోతీకుమార్‌కు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యువకుడి మెంటర్ రామనఅచ్యుత్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment