ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్ ఉండొద్దు..
ఖమ్మంసహకారనగర్: ప్రజావాణిలో దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజావాణిలో ఆయన అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డితో కలిసి దరఖాస్తులు,వినతిపత్రాలు స్వీకరించారు. ఈసందర్భంగా సత్తుపల్లి మండలం గంగారం పీహెచ్‌సీకి చెందిన ఎన్.మారేశ్వరి తాను కాంటింజెంట్ వర్కర్‌గా పనిచేస్తుండగా రూ.5వేల వేతనాన్ని 30నెలలుగా ఇవ్వడం లేదని ఫిర్యాదు చేయడంతో వెంటనే పరిష్కరించాలని డీఎంహెచ్‌ఓకు సూచించారు. అలాగే, పలువురి సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం చూపిన కలెక్టర్ మిగతా దరఖాస్తులపై అధికారులకు సూచనలు చేశారు. ప్రజావాణిలో డీఆర్‌డీఓ సన్యాసయ్య, డీఆర్‌ఓ రాజేశ్వరి, కలెక్టరేట్ ఏఓ అరుణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
Comments
Please login to add a commentAdd a comment