‘ఆమె’దే ఆధిక్యం !
● జిల్లా ఓటర్ల తుది జాబితా విడుదల ● మొత్తం ఓటర్లు 12,30,572 మంది
ఖమ్మంసహకారనగర్: జిల్లా ఓటర్ల తుది జాబితాను సోమవారం అధికారులు ప్రకటించారు. ఈ జాబితా ప్రకారం జిల్లాలో 12,30,572 మంది ఓటర్లు ఉండగా పురుషుల కన్నా 44,884 మంది మహిళలు ఎక్కువగా ఉండడం విశేషం. మొత్తంగా 5,92,800 పురుషులు, 6,37,684 మంది మహిళలు ఉండగా ఇతరులు 88మంది ఉన్నారు. అలాగే, సర్వీస్ ఓటర్లు 688 మంది, ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు 192 మంది ఉన్నట్లు జాబితా ద్వారా వెల్లడైంది. ఈ జాబితాను జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాలు, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి, అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి కార్యాలయాల్లో ప్రచురించారు. జిల్లాలోని ఐదు నియోజకవర్గాలు, 1,460 పోలింగ్ స్టేషన్ల పరిధిలో 2024 ఓటర్ల జాబితా ప్రకారం 12,27,230 మంది ఓటర్లు ఉండగా.. ప్రస్తుతం 8,582 మంది కొత్త ఓటర్లను చేర్చగా.. 5,240 మందిని తొలగించారు.
నియోజకవర్గాల వారీగా ఓటర్ల వివరాలు
నియోజకవర్గం పురుషులు మహిళలు ఇతరులు
ఖమ్మం 1,55,326 1,68,859 49
పాలేరు 1,16,655 1,26,225 08
మధిర 1,07,550 1,15,805 10
వైరా 94,196 1,00,340 04
సత్తుపల్లి 1,19,073 1,26,455 17
మొత్తం 5,92,800 6,37,684 88
Comments
Please login to add a commentAdd a comment