కాల్వొడ్డు మున్నేరులో మరో మార్గం
ఖమ్మంగాంధీచౌక్: గత ఏడాది సెప్టెంబర్‌లో వచ్చిన భారీ వరదలతో ఖమ్మంలో మున్నేరుపై నిర్మించిన వంతెనలు ప్రమాదకరంగా మారాయి. సుమారు వందేళ్ల క్రితం కాల్వొడ్డులో నిర్మించిన వంతెనతో పాటు ప్రకాష్‌నగర్‌లోని వంతెన పైనుంచి భారీ వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ద్విచక్రవాహనాలు, ఆటోలు, కార్లను మాత్రమే అనుమతిస్తుండగా కాల్వొడ్డు వంతెన సమీపాన మున్నేరు ప్రవాహం ఇటీవల తగ్గింది. దీంతో బ్రిడ్జి కింద చప్టా మాదిరి బీటీ రోడ్డు వేసి ఖమ్మంకు వచ్చే వాహనాలను అనుమతిస్తున్నారు. ఇక ఖమ్మం నుంచి హైదరాబాద్, వరంగల్, కోదాడ వైపునకు వెళ్లే వాహనాలకు యథావిధిగా పాత వంతెన పైనుంచి పంపిస్తున్నారు. వన్‌వే పద్ధతిలో రాకపోకలు జరుగుతుండడంతో రద్దీకి చెక్ పెట్టినట్లయింది. అంతేకాక పాత వంతెన వద్ద తీగల వంతెన నిర్మాణ పనులు జరుగుతుండగా ఆటంకం ఎదురుకాకుండా రెండో రహదారి ఉపయోగపడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment