హక్కులు, బాధ్యతలు రెండు కళ్లు
ఖమ్మంసహకారనగర్: అధ్యయనం, అభ్యాసనం, సామాజిక స్పృహ లక్ష్యాలుగా.. హక్కులు, బాధ్యతలు రెండు కళ్లుగా యూటీఎఫ్ ప్రయాణం కొనసాగుతోందని సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చావ రవి, ఏ.వెంకట్ తెలిపారు. ఖమ్మంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. యూటీఎఫ్ స్వర్ణోత్సవ రాష్ట్ర మహాసభలు ఈనెల 5నుండి 8వ తేదీ వరకు కాకినాడలో జరగనున్నాయని వెల్లడించారు. ఉపాధ్యాయుల సంక్షేమం, ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధి కోసం యూటీఎఫ్ ఆది నుంచి కృషి చేస్తోందని తెలిపారు. రానున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అలుగుబెల్లి నర్సిరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మరొకసారి గెలిపించాలని వారు ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. కాగా, హైదరాబాద్, నల్లగొండ నుంచి వస్తున్న జాతాలు వరంగల్ క్రాస్ రోడ్డు వద్ద ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించగా యూటీఎఫ్ నాయకులు స్వాగతం పలికారు. అనంతరం ఖమ్మం జిల్లా జాతాతో కలిసి ముందుకు బయలుదేరగా సీనియర్ నాయకుడు జియావుద్దీన్ ప్రారంభించారు. టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ రంజాన్, పారుపల్లి నాగేశ్వరరావుతో పాటు జీ.వీ.నాగమల్లేశ్వరరావు, బి.వెంకన్న, షమీ, రాంబాబు, రాందాస్, ఉద్దండు, సురేష్, నాగేశ్వరరావు, సుధాకర్, నవీన్ కుమార్, అరవింద్, శ్రీనివాసరావు, గురవయ్య, శచేంద్రబాబు బి.నర్సింహారావు, రాజశేఖర్, వీరబాబు, కల్యాణం నాగేశ్వరరావు పాల్గొన్నారు.
నేటి నుంచి యూటీఎఫ్ స్వర్ణోత్సవ సభలు
Comments
Please login to add a commentAdd a comment