సీనియర్ ఖో–ఖో జిల్లా జట్ల ఎంపిక
కల్లూరు: ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థాయి ఖో–ఖో పురుషులు, మహిళల జట్లను శనివారం ఎంపిక చేశారు. కల్లూరు మినీ స్టేడియంలో ఖో–ఖో అసోసియేషన్ ఆధ్వర్యాన ఎంపిక పోటీలు నిర్వహించగా 50 మంది చొప్పున పురుషులు, మహిళలు హాజరయ్యారు. వీరిలో నుంచి 18మంది చొప్పున క్రీడాకారులతో జట్లను ప్రకటించారు. ఆయా జట్లు ఈనెల 8నుంచి వరంగల్ జిల్లా గీసుకొండలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటాయని ఖో–ఖో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి పసుపులేటి వీరరాఘవయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ పత్తిపాటి నివేదిత, పీడీలు, అసోసియేషన్ బాధ్యులు వరకా రామారావు, భీమా, ఎస్.ప్రసాద్, సమ్మయ్య, సాంబశివారెడ్డి, పాపారావు, రమేష్, గుంటుపల్లి రమాదేవి, శ్వేత, పద్మ, త్రివేణి, విజయ, సునీత పాల్గొన్నారు. కాగా, క్రీడాకారులకు స్ఫూర్తి ఫౌండేషన్ తరఫున వుయ్యూరి శ్రీవ్యాల్ క్రీడాదుస్తులు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment