బాలల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత
ఖమ్మంలీగల్: బాలల హక్కుల పరిరక్షణను సమాజంలోని అందరూ బాధ్యతగా భావించాలని జిల్లా ఇన్‌చార్జి ప్రధాన న్యాయమూర్తి ఉమాదేవి సూచించారు. ఖమ్మంలోని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో రెండు రోజుల పాటు జరిగే అవగాహన సదస్సు శనివారం ప్రారంభం కాగా ఆమె మాట్లాడారు. బాలలు సమాజానికి అమూల్య సంపద అని తెలిపారు. ఈనేపథ్యాన వారికి హక్కులపై అవగాహన కల్పించేలా అన్ని వ్యవస్థలు పనిచేయాలని చెప్పారు. బాలల ఉత్తమ ప్రయోజనాల పరిరక్షణ, రక్షణకు అనేక చట్టాలు ఉన్నాయని తెలిపారు. న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి చంద్రశేఖరరావు మాట్లాడుతూ బాలల రక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం బాలల సంరక్షణాధికారి విష్ణువందన, చీఫ్ డిఫెన్స్ కౌన్సిల్ మామిడి హన్మంతరావుతో పాటు లలిత, వలరాజు, శ్రీనివాసగుప్తా మాట్లాడగా ప్యానెల్ న్యాయవాదులు ఇమ్మడి లక్ష్మీనారాయణ, శ్రీలక్ష్మి, రామలక్ష్మి, లలిత, అమర్‌నాథ్, కల్యాణి, వాసవి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment