నాగార్జున యూనివర్సిటీ నుంచి డాక్టరేట్
ఖమ్మం స్పోర్ట్స్: ఖమ్మంకు చెందిన చెందిన భట్టు అరుణ్‌కుమార్‌కు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగంలో డాక్టరేట్ సాధించారు. ప్రొఫెసర్ పి.జాన్సన్, డాక్టర్ జీ.పీ.రాజు, పి.సుధాకర్ నేతృత్వాన ఆయన ఫుట్‌బాల్ క్రీడాకారుల శిక్షణపై సమర్పించిన పరిశోధనాత్మక గ్రంధానికి డాక్టరేట్ ప్రకటించారు. ఈసందర్భంగా అరుణ్, ఆయన తల్లిదండ్రులు వీరభద్రం, శాంతిని పలువురు అభినందించారు.
లాల్‌సింగ్ తండా వాసికి..
కూసుమంచి: కూసుమంచి మండలం లాల్‌సింగ్‌తండాకు చెందిన భూక్యా జాన్ వెస్లీకి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో ఉస్మానియా యూనివర్సిటీ నుండి డాక్టరేట్ ప్రకటించారు. ప్రొఫెసర్లు సురేష్‌బాబు, సతీష్‌కుమార్ పర్యవేక్షణలో పరిశోధనా పత్రం సమర్పించిన ఆయన డాక్టరేట్ అందుకున్నారు. మారుమూల తండాకు చెందిన నిరుపేద కుటుంబంలో జన్మించిన జాన్‌వెస్లీ పట్టుదలతో చదివి డాక్టరేట్ సాధించడంతో పలువురు అభినందించారు.
నిత్యాన్నదానానికి
రూ.లక్ష విరాళం
భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో శాశ్వత నిత్యాన్నదానానికి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన భక్తులు శనివారం విరాళం అందచేశారు. అనంతపురం జిల్లా గుత్తి గ్రామానికి చెందిన గొర్ల రమేష్ – మహేశ్వరి దంపతులు రూ.లక్ష చెక్కును అధికారులు అందచేశాక స్వామిని దర్శించుకుని పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, దాతల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment