మోడీ చేసే మోసాలకు భారతరత్న ఇవ్వాలి
ఖమ్మం మామిళ్లగూడెం: దేశంలో నిరుద్యోగ సమస్య లేకుండా ఏటా కోటి ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధిపై ఇచ్చిన హామీలను విస్మరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి భారతరత్న అవార్డు ఇవ్వాలని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ కే.ఏ.పాల్ వ్యాఖ్యానించారు. ఖమ్మంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అవమానపరిచేలా కేంద్ర మంత్రులు వ్యవహరిస్తుండడం మంచి పద్ధతి కాదన్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ విషయమై ప్రతీఒక్కరు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలంగాణలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఏటా రూ. లక్షన్నర కోట్ల అప్పు చేస్తూ ప్రజలపై భారం మోపుతోందని ఆయన ఆరోపించారు. కాగా, ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి ముగ్గురు మంత్రులు చొరవ చూపాలని కోరారు. రానున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ గెలుపొందిన చోట్ల వంద రోజుల్లో అభివృద్ధి చేసి చూపిస్తామని పాల్ ప్రకటించారు.
● ఖమ్మం సహకారనగర్: సమగ్ర శిక్షా అభియాన్(ఎస్‌ఎస్‌ఏ) ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకపోతే హైదరాబాద్‌లోని జింఖానా మైదానంలో 20వేల మంది ఉద్యోగులతో మహాధర్నా నిర్వహిస్తామని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ కే.ఏ.పాల్ తెలిపారు. కలెక్టరేట్ వద్ద ఉద్యోగుల దీక్షా శిబిరాన్ని సందర్శించిన ఆయన మాట్లాడారు.
ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కే.ఏ.పాల్
Comments
Please login to add a commentAdd a comment