ఎస్సెస్సీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
ఖమ్మంసహకారనగర్: పదో తరగతి ప్రత్యేక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అకడమిక్ మానిటరింగ్ అధికారి రవికుమార్ కోరా రు. గురువారం ఎన్నెస్సీ కాలనీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎస్సెస్సీ విద్యార్థులకు నిర్వహించిన ప్రత్యేక పరీక్షను పరిశీలించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రార్థనలో పాల్గొని విద్యార్థులకు క్రమశిక్షణ, విద్య ప్రాధాన్యతను వివరించారు. పరీక్షలో విద్యార్థుల ప్రదర్శన ఆధారంగా పాఠశాలస్థాయిలోనే ప్రత్యేక ప్రణాళిక రూపొందించి విద్యార్థుల భవతకు బాటలు వేసేలా కృషి చేయాలని సిబ్బందికి సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment